రాష్ట్రీయం

రైతుబంధుకు షరతులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతుబంధు’ పథకానికి ఈ ఏడు షరతులు విధించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. 2018 వానాకాలం సీజన్‌లో రైతుబంధు డబ్బులు 2018 మే నెలలోనే చెల్లించారు. దాదాపు ఆరువేల కోట్ల రూపాయలు చెక్కుల ద్వారా చెల్లింపులు జరిగాయి. 2018-19 యాసంగిలో 30 లక్షల మంది రైతులకు రైతుబంధు చెల్లింపులు చేసినప్పటికీ, మరో 20 లక్షలపైగా రైతులకు చెల్లింపులు జరగలేదు. వాస్తవంగా యాసంగి రైతుబంధు డబ్బులు 2018 డిసెంబర్ వరకే చెల్లించాల్సి ఉన్నప్పటికీ, అయిదు నెలలైనా చెల్లించలేదు. సుమారు 2,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ 2019 వానాకాలానికి సంబంధించి రైతుబంధు అమలు చేయాల్సి ఉంది. వానలు రాగానే రైతులు విత్తనాలు వేయడం మొదలు పెడతారు. ప్రభుత్వం చెల్లించే డబ్బులు విత్తనాల కొనుగోలు, ఎరువుల కొనుగోలు, దుక్కిదున్నడం తదితర అవసరాల కోసం వాడతారు. రాష్ట్రం ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల భూమి బాగా నానిన చోట్ల ఇప్పటికే దున్నడం మొదలైంది. విత్తనాలు వేసేందుకు భూమిని సిద్ధం చేయడంలో రైతులు నిమగ్నమయ్యారు. బ్యాంకులకు రుణాల కోసం వెళ్లకుండా, రైతుబంధు డబ్బులు ఎప్పుడు వస్తాయా అని రైతులంతా ఎదురు చూస్తున్నారు. రైతుబంధు కింద గత ఏడాది ఎకరానికి నాలుగువేల రూపాయలు చెల్లించగా, ఈ ఏడు ఎకరానికి ఐదువేల రూపాయల చొప్పున చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంటే 2018-19 సంవత్సరం బడ్జెట్‌లో రైతుబంధుకోసం 12 వేల రూపాయలు కేటాయించగా, 2019-20 సంవత్సరానికి 20 శాతం పెరుగుదల ఉంటుంది. అంటే 15 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని స్పష్టమవుతోంది. వానాకాలానికి 7,500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. 2018-19 యాసంగికి బకాయిలుగా ఉన్న 2,000 కోట్ల రూపాయలు, 2019 వానాకాలానికి అవసరమైన 7,500 కోట్ల రూపాయలు కలిపితే 9,500 కోట్ల రూపాయలు రైతులకు జూన్ 15 లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లాస్థాయి అధికారులకు కాని, మండల, గ్రామ స్థాయి వ్యవసాయ అధికారులకు కాని రైతుబంధు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ కారణంగానే షరతులు ఏవైనా విధిస్తారా అన్న చర్చ మొదలైంది.
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు, గ్రామపంచాయతీ ఎన్నికలు, జిల్లాప్రజాపరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు ముగిసిపోయాయి. ఇక గ్రామాల్లో ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు, మున్సిపాలిటీల ఎన్నికలు మాత్రమే మిగిలాయి. అందువల్ల ఏవైనా షరతులు విధిస్తూ, విధాన నిర్ణయాలు తీసుకున్నా, ఎన్నికలపై ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రైతుబంధుపై కూడా విధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాదిలాగే రైతులందరికీ చెల్లింపులు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. రైతు సమగ్ర సర్వే తర్వాత విధాన నిర్ణయం ఏదైనా తీసుకుంటారేమోనని నిపుణులు భావిస్తున్నారు. రైతు సమగ్ర సర్వే త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం క్షేత్రస్థాయి సిబ్బందిపై వత్తిడి చేస్తోంది. సర్వే నివేదిక తర్వాత ప్రభుత్వం విధాన ప్రకటన చేస్తారని నిపుణులు భావిస్తున్నారు.