రాష్ట్రీయం

ఆంధ్రలో ‘మైక్రో’కు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్ సూక్ష్మసేద్యం (మైక్రో ఇరిగేషన్) రంగంలో దేశంలోనే ముందుకు అత్యంత వేగంగా దూసుకుపోతోంది. తాజా వివరాల ప్రకారం గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, ఎపి రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానం సంపాదించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలో 28 లక్షల ఎకరాల్లో మైక్రో విధానంలో సేద్యం చేసేందుకు అవకాశం ఉండగా, ఇప్పటి వరకు 17 లక్షల ఎకరాల్లో సేద్యం జరుగుతోంది. 2015-16 సంవత్సరంలోనే సుమారు 2.40 లక్షల ఎకరాలు కొత్తగా ఈ విధానంలో సాగులోకి వచ్చాయి. ప్రధానంగా పళ్లతోటల పెంపకం, పూల తోటల పెంపకం మాత్రమే కాకుండా వేరుసెనగ తదితర పంటలకు కూడా ఈ విధానానే్న అమలు చేస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలను ఉత్పత్తి చేయాలన్నదే ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రాథమిక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో మైక్రో ఇరిగేషన్‌కు పెద్దపీట వేస్తున్నారు. 2016-17లో కనీసం 4లక్షల ఎకరాల్లో మైక్రో విధానంలో పంటలకు నీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించామని ఎపిఎంఐపి ప్రాజెక్ట్ ఆఫీసర్ అమ్మినేని సూర్యప్రకాశ్ తెలిపారు. సోమవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ 2003లో ప్రారంభించిన మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల ఒకవైపు నీటి యాజమాన్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా పంటల ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరిగాయన్నారు.
2003 నుండి ఇప్పటి వరకు 17.50 లక్షల ఎకరాల్లో ఈ విధానంలో సేద్యం అమలవుతోందని వివరించారు.2016-17 సంవత్సరానికి తాము రూపొందించిన ప్రణాళిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం 220 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 359 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు అంగీకరించాయి. అలాగే గ్రామీణ వౌలిక సదుపాయల నిధి (ఆర్‌ఐడిఎఫ్) కింద నాబార్డ్ 125 కోట్ల రూపాయలు సమకూర్చేందుకు అంగీకరించిందని ఆయన వివరించారు. సూక్ష్మ సేద్యం కింద ఎస్‌సి, ఎస్‌టిలకు నూటికి నూరు శాతం సబ్సిడీతో పరికరాలను ఇస్తున్నామని సూర్యప్రకాశ్ తెలిపారు. ఇతరులకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామని వివరించారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మైక్రో సేద్యం చేసే రైతులకు పది ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. ఒక హెక్టారులో మైక్రో పరికరాలను ఏర్పాటు చేసేందుకు 70 వేల రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్పారు.
గతంలో మైక్రో విధానంలో పరికరాలను ఏర్పాటు చేసుకున్న రైతుల గురించి తాజాగా సర్వే చేస్తున్నామని, మరో రెండునెలల్లో ఈ సర్వే పూర్తవుతుందన్నారు. దాదాపు 300 మంది సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. పాత విధానం ఎక్కడైనా పనిచేయకపోతే రైతులతో చర్చించి, మళ్లీ ఈ విధానాన్ని పునరుద్ధరించేందుకు 50శాతం సబ్సిడీతో కొత్త పరికరాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని ‘రివైవల్ ఆఫ్ ఓల్డ్ మైక్రో సిస్టం’ అని పిలుస్తున్నారు.