రాష్ట్రీయం

కథానాయకుడిగా వీవీ వినాయక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగల్లు, మే 19: తెలుగు అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకరైన వీవీ వినాయక్ కథానాయకుడిగా మారుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నరసింహం దర్శకునిగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మెగా డైరెక్టర్‌గా సత్తా చాటుకున్న వినాయక్ హీరోగా మారతారా అన్న సందేహం అందరిలోనూ ఉన్నా మీరు విన్నది నిజమేనంటున్నారు వివి వినాయక్. తన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు ఆదివారం వచ్చిన ఆయన స్వగృహంలో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు. తాను సినీ దర్శకుడిని అవుతానని ఎన్నడూ అనుకోలేదని, అలాగే హీరో అవకాశం కూడా అనుకోకుండా వచ్చిందని, ఇది ఊహించని పరిణామని, భగవత్ సంకల్పమన్నారు. ఇప్పటి వరకు 16 సినిమాలకు దర్శకత్వం వహించానని, గత సంవత్సరంన్నర కాలంగా ఒక ప్రత్యేకమైన కథను తయారుజేసుకుని నల్లమలుపు బుజ్జి నిర్మాతగా సెట్స్‌పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నానన్నారు. అయితే అదే సమయంలో నిర్మాత దిల్ రాజు తిరుపతి వెళుతూ తనను కలిసి ‘నన్ను నిర్మాతగా మార్చిన నిన్ను హీరోగా పరిచయం చేయాలనుకొంటున్నట్టు’ చెప్పారన్నారు. దానికి తగిన కథ సిద్ధంగా ఉందని.. ఎవరా అని ఎదురుచూస్తున్నామని, దీనికి నువ్వే సరిపోతావని, వెంటనే డైరెక్టర్ నరసింహానికి తెలియజేయగా ఓకే చెప్పారన్నారు. ప్రఖ్యాత దర్శకుడు శంకర్‌కు అసోసియేట్‌గా పనిచేస్తున్న నరసింహం దర్శకత్వం వహిస్తారన్నారు. కథా కథనం హుందాగా ఉండాలని, హీరోయిన్‌తో వెకిలి వేషాలు ఉండవన్నారు. 1980 బ్యాక్ డ్రాప్‌గా రియల్ ఏజ్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఈ చిత్రం ఉంటుందన్నారు. తనకు సి కళ్యాణ్, నల్లమలపు బుజ్జి నిర్మాతలుగా రెండు సినిమాలు కమిట్‌మెంట్ ఉందని, అయితే ముందుగా తాను హీరోగా నటిస్తున్న చిత్రం పూర్తయిన తర్వాతే వాటిని చేపడతానన్నారు. హీరోగా వెంటనే అంగీకరించటానికి కారణం దిల్ రాజుపై గల నమ్మకమేనన్నారు. కథానాయకుడి పాత్ర పోషించడానికి కొంత ఆందోళన ఉన్నా డైరెక్టర్లు, సినీ పరిశ్రమతో అనుబంధం ముందుకు నడిపిస్తోందన్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుందన్నారు. ఈ చిత్రంలో ఎక్కువగా కొత్తవాళ్లే ఉంటారన్నారు. తనను హీరోగా దిల్ రాజు తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రకటించడం దైవ సంకల్పంగా భావిస్తున్నానన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తన తండ్రి సూచన తనకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, బంధువులు వినాయక్‌ను కలిసి అభినందనలు తెలిపారు. విలేఖర్ల సమావేశంలో వినాయక్ సోదరుడు, మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్ర కుమార్, జుట్టా కొండలరావు, పిండి మంగరాజు, జూనియర్ ఆర్టిస్టులు సూరిబాబు, కృష్ణ, పుట్టయ్య తదితరులు పాల్గొన్నారు.