రాష్ట్రీయం

అనుసంధానంలో మరో అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 20: జీవనది గోదావరి నదితో మహానది అనుసంధానం కానుంది. ఈ బృహత్తర పథకానికి సంబంధించి రూ.47,533 కోట్ల ప్రాథమిక అంచనాతో ముసాయిదా ప్రాజెక్టు రూపుదాల్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ వాటర్ డవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) కేంద్రానికి ముసాయిదా నివేదిక సమర్పించింది. ఈ క్రమంలో ప్రాజెక్టు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) దశకు చేరుకుంటోంది. దీనితో ఒడిశాలోని మహానదిని ఆంధ్రాలోని గోదావరి నదితో అనుసంధానం చేసే బృహత్తర పథకం రూపుదాల్చుతోంది.
మహానది-గోదావరి అనుసంధానంలో ఒడిశాలోని రుషికుల్య, ఆంధ్రప్రదేశ్‌లోని శారదా నది మీదుగా గోదావరి నదిలో మహానది జలాలు విలీనం అవుతాయి. మహానదిని గోదావరి నదిలో సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి ఎగువ రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు వద్ద విలీనం చేస్తారు.
మహానది జలాలను ఒడిశాలోని బర్ముల్ డ్యామ్‌కు ఎగువన రుషికుల్య వద్ద నుంచి గోదావరి నది బ్యారేజి ఎగువ వరకు 828 కిలోమీటర్ల మేరకు కాలువల ద్వారా అనుసంధానం చేస్తారు. రూ.47,533 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును రూపకల్పన చేశారు. మహానది నుంచి 11వేల 733 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలను మార్గమధ్యంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో ఆయకట్టుకు, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందిస్తూ 6500 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలను సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి ఎగువన గోదావరి నదిలో విలీనంచేస్తారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశా రాష్ట్రంలోని 2లక్షల 56వేల 770 హెక్టార్లకు ఆయకట్టుకు నీరు అందుతుందని అంచనా. ప్రాజెక్టు పూర్తయ్యాక ఏటా 3,51,786 హెక్టార్లకు నీరందుతుందని అంచనా. ఇందుకు వార్షికంగా 3,184 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలను వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం లక్షా 7వేల 189 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అంచనా. ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రతి ఏటా 91,110 హెక్టార్లకు సాగునీరు అందిస్తారు. ఇందుకు వార్షికంగా 606 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలను కేటాయిస్తారు. మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్టులో 3 లక్షల 63వేల 959 హెక్టార్లకు సాగునీరు అందుతుందని అంచనావేయగా, ప్రాజెక్టు పూర్తయ్యాక ఏటా 4 లక్షల 42వేల 896 హెక్టార్లకు నీరు అందించడానికి వార్షికంగా 3వేల 790 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలను కేటాయిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటికి 366 మిలియన్ క్యూబిక్ మీటర్లు, పారిశ్రామిక అవసరాలకు 436 మిలియన్ క్యూబిక్ మీటర్లు నీటిని సరఫరా చేస్తారు. రవాణాలో 641 మిలియన్ క్యూబిక్ మీటర్లు జలాల నష్టం పోను 6500 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలను గోదావరి నదిలో విలీనం చేస్తారు.
ఒడిశాలోని బర్ముల్ డ్యామ్ నుంచి అదే రాష్ట్రంలోని ఖుర్ధా జిల్లాలోని శాలియా డ్యామ్‌కు అక్కడ నుంచి మన రాష్ట్రంలోని హీర మండలం వద్ద వంశధారకు అనుసంధానం, అక్కడ నుంచి శారదా నదికి అనుసంధానం అవుతాయి. ఒడిశాలోని బర్ముడా డ్యామ్‌కు ఎగువన 225.050 కిలోమీటర్ల ఎగువనున్న రుషికుల్య నది నుంచి ప్రాజెక్టు మొదలై 661.100 కిలోమీటర్ల దూరంలోని శారదా నదికి 801.98 క్యూమెక్‌ల జలాలతో మొదలై 500.23 క్యూమెక్‌ల జలాలను చేర్చుతాయి. అక్కడ నుంచి 842.300 కిలోమీటర్లు వరకు 352.79 క్యూమెక్‌ల జలాలను సరఫరా చేసేలా డిజైన్‌చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి రూ.4లక్షల 91వేల 500 కోట్లు వార్షికాదాయం లభిస్తుందని అంచనా. బీసీ రేషియో 2.6గా రూపకల్పనచేశారు. సొరంగంతోపాటు మొత్తం 842.300 కిలోమీటర్ల పొడవున కాలువలు తవ్వుతారు. కాలువల పొడవు ఒడిశాలో 316.300 కిలోమీటర్లు, ఏపీలో 526 కిలోమీటర్లు వుంటుంది. ఒడిశాలోని నయాగర్, ఖుర్ధా, గంజాం, గజపతి, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలోని తుని, కత్తిపూడి, పెద్దాపురం, రాజానగరం మీదుగా రాజమహేంద్రవరం రూరల్ మండలంలోకి మహానది జలాలు ప్రవేశిస్తాయి. మొత్తం మీద దేశంలో నదుల అనుసంధానంలో భాగంగా మహానది నుంచి గోదావరి, గోదావరి నుంచి కృష్ణా, కృష్ణా నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరి నదుల అనుసంధానంలో భాగంగా మహానది గోదావరి నది అనుసంధాన ప్రాజెక్టు రూపుదాల్చింది.