రాష్ట్రీయం

లెక్క తేలకపోతే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లోక్‌సభ ఓట్ల లెక్కింపు సందర్భంగా సాంకేతిక కారణాలతో ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్లలోని ఓట్లు సరిపోకపోతే ఏం చేయాలన్న అనుమానం కౌంటింగ్ సిబ్బందిలో చాలా మందికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ నేతృత్వంలో సోమవారం ఇక్కడి హోటల్ తాజ్‌కృష్ణలో జిల్లా కలెక్టర్లు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం), ఓటర్ వెరిఫియేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) లలో నమోదైన ఓటర్ల వివరాలు ఒకదానితో మరొకటి సరిగ్గా ఉంటే ఎలాంటి సమస్య ఉండదని, సాంకేతిక కారణాల మూలంగా రెండింటి సంఖ్య మధ్య తేడా వస్తే ఏం చేయాలని అంటూ కౌంటింగ్ సిబ్బంది ప్రశ్నించారని తెలిసింది. వాస్తవంగా ఈ అనుమానం శిక్షణలో పాల్గొన్న అందరిలోనూ వచ్చింది. ఈ సందర్భంగా సీఈఓ రజత్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ భన్వర్‌లాల్ మాట్లాడుతూ, తేడా వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఏదైనా కారణంతో తేడా వస్తే ఆ విషయాన్ని వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) కు తెలియచేసి, వారి సలహా తీసుకుందామని రజత్ కుమార్, భన్వర్‌లాల్ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.