రాష్ట్రీయం

కౌంటింగ్‌కు భారీ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: లోక్‌సభ ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారులైన (డీఈఓ) జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్‌ఓ) అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్, ఈసీఐ సీనియర్ కన్సల్టెంట్ భన్వర్‌లాల్ సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) సూచనల మేరకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, పూర్వాపరాలపై సమీక్ష కోసం, వివిధ అంశాలపై చర్చల కోసం సోమవారం ఇక్కడి హోటల్ తాజ్‌కృష్ణలో డీఈఓలు, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రజత్ కుమార్‌తో పాటు భన్వర్‌లాల్ కూడా మాట్లాడుతూ, కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముం దస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, కౌంటింగ్ విధానం ఏ విధంగా కొనసాగించాలన్న అంశాలపై సీఈసీ నియమావళిని రూపొందించిందని గుర్తు చేశారు. ఈ నియమావళికి లోబడే పనిచేయాలని కలెక్టర్లతో పాటు ఇతర సిబ్బందికి స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూంలు తెరిచే సమయంలో అభ్యర్థులు లేదా వారి ఏజంట్లు, కేంద్ర పరిశీలకులు తప్పనిసరిగా ఉండేలా కలెక్టర్లు, ఇతర అధికారులు చూడాలని సూచించారు. మొదటి రెండు రౌండ్ల లెక్కింపును అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్లను, ఇతర డాక్యుమెంట్లను తగిన బందోబస్తు మధ్య తిరిగి స్ట్రాంగ్‌రూంలకు తరలించాలని కోరారు. ఫలితాలను నిర్దేశిత ఫారాలలో నింపి సీఈసీకి పంపించాలన్నారు.
ఓట్ల లెక్కింపు సమయంలో సువిధ అనే అప్లికేషన్‌ను వినియోగించే అంశంపై మాస్టర్ ట్రైనర్లు వివరించారు. 23 న ఓట్ల లెక్కింపు ఉన్నందువల్ల లెక్కింపు సన్నద్ధతను మే 21 న పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు రిహార్సల్ చేయాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీఈసీ శిక్ష కూడా విధిస్తుందని భన్వర్‌లాల్ హెచ్చరించారు.

చిత్రం... లోక్‌సభ ఓట్ల లెక్కింపుఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్లు, ఆర్‌వోలు, ఏఆర్‌వోల సమావేశంలో మాట్లాడుతున్న సీఈవో రజత్‌కుమార్