రాష్ట్రీయం

వృత్తి విద్యా కళాశాలలకు ఏకరూప ఫీజు ఖరారు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వృత్తి, సాంకేతిక విద్యాకోర్సులకు ఏక రూప ఫీజులను ఖరారు చేయాలని యాజమాన్యాల సంఘం రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరింది. ఫీజులు కోర్సుల వారీ ఉండాలే తప్ప, కాలేజీల వారీ కాదని వారు సూచించారు. బీటెక్/బీ ఫార్మసీ కోర్సులకు 60వేలు, ఎంబీఏకు 50వేలు, ఎంసీఏకు 75వేలు, ఎంటెక్‌కు 75వేలు, ఎం ఫార్మసీకి 1.50 లక్షలు ఫీజు ఖరారు చేయాలని ఫెడరేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రొఫెసనల్ ఇనిస్టిట్యూషన్స్ కోరింది. 2019-22 విద్యాసంవత్సరానికి గానూ ఫీజుల నిర్ణయ విధానం సక్రమంగా లేదని, ఫీజుల నిర్ణయం అకారణంగానూ, అమలుకు సాధ్యం కాని రీతిలో ఉందని ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ కేవీకే రావు, ప్రధాన కార్యదర్శి జీవీ ప్రసాదరావు, కార్యదర్శి ఎం సంషీర్ బేగ్ పేర్కొన్నారు. ఫీజు నిర్ణయానికి సంబంధించి ఏ అంశాలు చూడాలో వాటిని మాత్రం వదిలిపెట్టారని చెప్పారు.
ఏఐసీటీఈ, యూనివర్శిటీ ఎప్పటికపుడు సూచించే విధంగా కాలేజీల్లో సౌకర్యాలను మెరుగుపర్చడానికి అయ్యే ఖర్చును ఫీజుల నిర్ణయంలో పరిగణలోకి తీసుకోవడం లేదని, తొమ్మిదో పే కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు వేతనాలు పెంచాల్సి ఉంటుందని, అలాగే ప్రతి విద్యాసంస్థకూ కొన్ని ప్రణాళికలు ఉంటాయని, ఆ వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని, వాస్తవ వ్యయాన్ని పరిగణించకుండా ఫీజులను ఎలా నిర్ధారిస్తారని వారు ప్రశ్నించారు. బీ కేటగిరి సీట్లకు సింగిల్ విండో ఆన్‌లైన్ కౌనె్సలింగ్‌ను నిర్వహించాలని, స్వయంప్రతిపత్తి ఉన్న విద్యాసంస్థల హక్కులను జేఎన్‌టీయుకే పరిగణించడం లేదని, తన పరిధికి మించి యూనివర్శిటీ వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. గవర్నర్ జోక్యం చేసుకుని విద్యారంగ పరిస్థితిని సమీక్షించాలని, యాజమాన్యాలను , విద్యార్థులను ఆదుకోవాలని వారు పేర్కొన్నారు.