రాష్ట్రీయం

వరి మొక్కపై సూక్ష్మక్రిమి దాడి నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: వరి మొక్కపై జాంతోమోనస్ ఒరిజే అనే సూక్ష్మక్రిమి దాడి చేసినపుడు మొక్క అవలంభించే దాడి నిరోధక పద్ధతిలో ఒక రకం మార్పును తాము కనుగొన్నామని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన సీనియర్ శాస్తవ్రేత్త డాక్టర్ హితేంద్ర కే పటేల్, డాక్టర్ రమేశ్ వీ శొంటిలు తెలిపారు. ఎక్స్‌ఓపిక్యూ అనే నామం ఉన్న బాక్టీరియల్ ఇన్‌ఫెక్టర్ వరి మొక్క కణాలలో 14-3-3 మాంసకృత్తులుగా వ్యవహారంలో ఉన్న కణాల మీద దాడి చేసినపుడు మొక్కలోని రక్షిత వ్యవస్థకు, సూక్ష్మక్రిమికి మధ్య బలాబలాల్లో ఏది పైచేయిని సాధిస్తుందన్న దానిపైన ఆ దాడి బారి నుండి మొక్క తనను తాను కాపాడుకోగలిగేదీ లేక కాపాడుకోలేనిదీ తెలుస్తూ వస్తుంది. సీఎస్‌ఐఆర్ , సీసీఎంబీ శాస్తవ్రేత్తలు ఇన్‌ఫెక్టర్ ప్రొటీన్ అనుక్రమాన్ని ఒక ఫలానా దశ వద్ద మార్చి చూశారు. ఈ దిద్దుబాటు, వరి మొక్కకు ఉన్న సూక్ష్మక్రిమి దాడి నిరోధక ప్రతిస్పందనల అణచివేతను నీరుగార్చిందని, దానికి బదులుగా ఈ పరివర్తన మరో 14-3-3 మాంసకృత్తులతో పరస్పర చర్యకు లోనై మొక్కను సూక్ష్మక్రిమికి లోబడనటువంటిదిగా తయారు చేసిందని శాస్తవ్రేత్తలు గుర్తించారు.
మొక్కలో సంరక్షణ దారు భూమికను పోషించే కణాలను గురించి మరింత లోతుగా అర్ధం చేసుకోవడం వల్ల బాక్టీరియల్ హైజాక్‌ను అడ్డుకోవడంలో కొత్తదారులను గురించి తెలియడంతో పాటు మొక్క కణజాలంలో రక్షణ సంబంధ ప్రతిచర్యలను పటిష్టపరచడం కూడా సాధ్యపడుతుందని అన్నారు. ఈ అధ్యయనం లో గుర్తించిన అంశాలను బ్రిటిష్ సొసైటీ ఫర్ ప్లాంట్ పాథాలజీ ప్రచురిస్తున్న జర్నల్ మాలిక్యులర్ ప్లాంట్ పాథాలజీలో ముద్రితమయ్యాయని వారు చెప్పారు.