రాష్ట్రీయం

నేడు అమరావతికి వైఎస్ జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అమరావతి పరిధిలో నిర్మించిన నివాసం, పార్టీ కార్యాలయానికి చేరుకుని, ఎన్నికల ఫలితాలను అక్కడి నుంచి సమీక్షిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో 175 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ హాలు లోపల, వెలుపల టీడీపీ కవ్వింపుచర్యలకు పాల్పడి ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆ ఉచ్చులో పడరాదని పార్టీ పోలింగ్ ఏజెంట్లు, క్రియాశీల కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు పంపించారు. ఓటమి భయంతోనే రకరకాల మెలికలు పెడుతూ ఈవీఎం కంటే ముందు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని చంద్రబాబు హడావుడి చేస్తున్నారని వైకాపా సీనియర్ నేత విశే్వశ్వరరెడ్డి చెప్పారు. అన్ని సర్వేలు టీడీపీ ఓటమి తప్పవని సంకేతాలు ఇవ్వడంతో దిక్కుతోచని చంద్రబాబు కౌంటింగ్ రోజు శాంతి భద్రతల సమస్యను సృష్టించే విధంగా కుట్ర పనే్న అవకాశం ఉంటుందన్నారు. కాగా 22వ తేదీ అమరావతికి తరలి వెళుతున్న జగన్, ఇక అక్కడి నుంచే అధికారికంగా పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తారు. జాతీయ స్థాయి ప్రాధాన్యత ఉన్న అంశాలపై అక్కడి నుంచి మాట్లాడుతారని వైకాపా నేతలు చెప్పారు. పార్టీలో సీనియర్ నేతలను కూడా హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చాలని జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలో హంగ్ పరిస్థితి తలెత్తితే ఏ పార్టీకి మద్దతు ఇచ్చే విషయమై వైకాపా ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వైకాపా నేత విశే్వశ్వరరెడ్డి చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకే తాము ప్రాధాన్యత ఇస్తామని, హోదా డిమాండ్‌ను కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా ఆమోదించాలన్నారు. చంద్రబాబు మాదిరిగా అనవసర ఆందోళనలో తాము లేమని, వేచి చూసే ధోరణిని అవలంబిస్తామన్నారు.