రాష్ట్రీయం

హంగ్ వస్తే.. మనదే హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బీజేపీ నాయకత్వంలోని ఏన్డీయేనే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడ మెజారిటీ రాకపోవచ్చని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించే అవకాశం తమకే వస్తుందని పార్టీ భావిస్తోంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయ్యే పక్షంలో అనుసరించాల్సిన వ్యూహానికి టీఆర్‌ఎస్ పదును పెడుతోంది. టీఆర్‌ఎస్ ఒంటరిగా కాకుండా తనతో కలిసొచ్చే పార్టీలతో కలిసి జట్టుగా ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారవచ్చని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావుఅంచనా వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ముందు దేశావ్యాప్తంగా పర్యటిస్తూ హస్తినలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న హడావుడి ఫలితాల ప్రకటన తర్వాత ఉండదని కేసీఆర్ భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించిన ఒకటి అరా సంస్థలు తప్ప దాదాపు అన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. అలాగే 18 నుంచి 20 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని తేల్చాయి. అలాగే తెలంగాణలో టీఆర్‌ఎస్ 14 నుంచి 15 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుచుకోనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి తోడు టీఆర్‌ఎస్ మిత్రపక్షం ఎంఐఎంకు దక్కే ఒక్క సీటుకూడా టీఆర్‌ఎస్ ఖాతాలోకే లెక్కకొస్తుంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వైసీపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిపి కనీసం 35 ఎంపీ సీట్లు ఖాయమని టీఆర్‌ఎస్ అంచనా. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 20 నుంచి 35 సీట్లు తక్కువైతే అప్పుడు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ సీపీ మద్దతు ఎన్డీయేకు అనివార్యంగా మారుతుందని కేసీఆర్ అంచనా. తమిళనాడులో డీఎంకే కూడా 15 నుంచి 17 ఎంపీ సీట్లు గెలుచుకోనుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. అయితే డీఎంకే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు మద్దతుగా ఉన్నప్పటికీ, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌కు అవకాశాలు తక్కువగా ఉండటంతో పార్టీ అధినేత స్టాలిన్ దక్షిణాది కూటమిగా తమతో జత కట్టే అవకాశం లేకపోలేదని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ, డీఎంకేకు కలిపి దక్షిణాది ప్రాంతీయ పార్టీల కూటమి బలం 50 సీట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తోంది. ఫలితాల వెల్లడి తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయేకు సరిపడి మెజారిటీ రానిపక్షంలో హస్తినలో టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ చక్రం తిప్పే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ పార్టీయే వందకు వంద శాతం అధికారంలో రావడంతో పాటు ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో చంద్రబాబు ప్రభవం మసకబారక తప్పదని గులాబీ దళం అంచనా వేస్తోంది.