రాష్ట్రీయం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కే. రామకృష్ణారావు వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2018-19 సంవత్సరానికి జీఎస్‌డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) 8,66,875 కోట్ల రూపాయలని, ఇది గత ఏడాది కంటే 15 శాతం అధికమని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గత ఐదేళ్లలో వార్షిక వృద్ధిరేటు 12 శాతం నుండి 15 శాతం మధ్య నమోదవుతూ వస్తోందని, ఏటా గణనీయంగా పెరుగుదల ఉందని వివరించారు. గత ఏడాది ప్రాథమిక రంగమైన వ్యవసాయం అనుబంధ రంగాల్లో 10.9 శాతం వృద్ధి సాధించామని, ద్వితీయ రంగంలో వృద్ధిరేటు 14.19 శాతమని, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇది 19.8 శాతంగా నమోదైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 2018-19 సంవత్సరంలో 64,716 కోట్ల రూపాయలని, అంతకు ముందటి ఏటి కంటే ఇది 14.5 శాతం అధికమన్నారు. సొంత ఆదాయం పెరుగుదలలో 14 రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోందన్నారు. గత ఏడాది మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) 22,904 కోట్ల రూపాయలని రామకృష్ణారావు తెలిపారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 2004-05 నుండి 2013-14 వరకు మూలధనం వ్యయం తెలంగాణలో 54,052 కోట్ల రూపాయలు కాగా, గత ఐదేళ్లలో మూలధనం మొత్తం వ్యయం 1,64,000 కోట్ల రూపాయని వివరించారు. మూలధన వయయం ఎక్కువ ఉంటే వృద్ధిరేటు అధికంగా ఉంటుందన్నారు.
పెండింగ్ బిల్లులు
------------
నీటిపారుదల, మిషన్ కాకతీయ, రోడ్లుభవనాలు, పంచాయతీరాజ్, ప్రజారోగ్యం, జాతీయ రహదారులు తదితర శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకోసం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు 3,474 కోట్ల రూపాయలు మాత్రమేనని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. వివిధ శాఖల్లో అభివృద్ధి పనులు ఒకవైపు జరుగుతూ ఉంటే బిల్లులు పెండింగ్‌లో ఉండటం సహజమేనని అన్నారు. రాష్ట్రంలో 125 ట్రెజరీలు, 20 పే అకౌంట్ కార్యాలయాలు ఉన్నాయని, వీటిలో రెండు లక్షల బిల్లులు ప్రాసెస్ అవుతూ ఉంటాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కువగా ఉన్నాయని, వీటిపై నిధులు ఖర్చు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకోసం ఐదేళ్లలో 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఈ ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలు పురోగతిలో ఉంటాయని, తద్వారా జీఎస్‌డీపీ పెరుగుతుందని వివరించారు.
మిషన్ భగీరథ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని, ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 47,047 కోట్ల రూపాయలని రామకృష్ణారావు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకోసం 29,521 కోట్ల రూపాయలు వ్యయం చేశామని, పనులు పూర్తయిన వాటికి చెల్లించాల్సిన బకాయాలు 659 కోట్ల రూపాయలు మాత్రమేనని వివరించారు.
విద్యార్థులకు ట్యూషన్ ఫీజు తదితరాలకు కలిపి ఏటా 3,000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నామని రామకృష్ణారావు తెలిపారు. 1800 కోట్ల రూపాయలు గత బకాయిలు ఉంటాయని, ఈ ఏటికి 1200 కోట్లరూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ఫీజు చెల్లింపులు సక్రమంగా, సకాలంలోనే జరుగుతున్నాయని తెలిపారు.

చిత్రం...సచివాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కే. రామకృష్ణారావు