రాష్ట్రీయం

ఆగస్టు 14న కెనడాలో అంతర్జాతీయ హిందీ సాహిత్య సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 21: కెనడా దేశంలో హిందీ ప్రాచుర్యాన్ని తెలియజేసే విధంగా ఆగస్టు 14 నుంచి 20వ తేదీ వరకూ రెండవ అంతర్జాతీయ హిందీ సాహిత్య సమ్మేళనం-2019ను నిర్వహించనున్నట్టు హిందీ అకాడమీ చైర్మన్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విశాఖలోని లోక్‌నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 16 దేశాల నుంచి హిందీ సాహిత్య కవులు సాహిత్య సమ్మేళనానికి హాజరవుతారన్నారు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలోని హిందీని అధికారభాషగా గుర్తించాలనే ఉద్దేశ్యంతోనే పలు దేశాల్లో ప్రతీయేటా సాహిత్య సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆరు రోజుల పాటు నిర్వహించే సాహిత్య సమ్మేళనం కెనడాలోని టొరంటో, అటావా, బ్రామ్‌టన్, నయాగరా ఫాల్స్ ఏరియాలో నిర్వహించి అక్కడి వారికి హిందీ కవుల విశేషాలను తెలియజేస్తామన్నారు. ఆగస్టు 14వతేదీన అటావాలో జరిగే సమ్మేళనంలో ప్రతినిధులకు స్వాగతం, 15న స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను కెనడా పార్లమెంట్‌లో. 16న బ్రామ్‌టన్‌లో హిందీ సాహిత్య సమ్మేళనం ప్రారంభం, 17న ఇండియా పెరేడ్ యాత్ర ప్రారంభంలో భాగంగా సాహిత్య రథంపై ప్రముఖ కవులతో హిందీ సమ్మేళనం, 18న నయాగరా ఫాల్స్ ఏరియాలో కవి సమ్మేళనం, 20న టొరంటోలో ముగింపు ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు అతిథులుగా శరణ్ ఘాయ్ (విశ్వహిందీ సంస్థాన్, కెనడా), ఆచార్య కామరాజ్ సింధు (గ్లోబల్ హిందీ సాహిత్య సంస్థ), డాక్టర్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (హిందీ అకాడమీ చైర్మన్) పాల్గొంటారన్నారు. వీరితోపాటు భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన మంత్రులు, హిందీ అకాడమీ సభ్యులు, కవులు హాజరవుతారన్నారు.