రాష్ట్రీయం

పోలవరంలో మరుగునపడిన సొరంగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 21: పోలవరం హెడ్ వర్క్సులో భాగంగా నిర్మించాల్సిన కీలకమైన సొరంగం (టనె్నల్) పనులు మరుగున పడ్డాయి. ఎంతసేపూ స్పిల్‌వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్, ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యామ్‌లపైనే తప్ప కీలకమైన టనె్నల్స్ విషయంపై దృష్టిపెట్టలేదని తెలుస్తోంది. హెడ్‌వర్క్సులో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 63, 64, 65ల్లో కదలిక కనిపించడంలేదు. వాస్తవానికి ఈ పనులన్నీ మే నాటికి పూర్తికావాల్సిందిగా లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఇప్పటికొచ్చి కనీసం 60 శాతం కూడా పూర్తికాలేదని సమాచారం.
ఎడమ వైపు కనెక్టవిటీల్లో భాగంగా 900 మీటర్ల పొడవున ఒక టనె్నల్‌ను నిర్మించాల్సివుంది. దీనితో పాటు అనుబంధ కాలువ తవ్వకంని, రెండువైపులా గట్లు, స్టిల్లింగ్ బేసిన్ తదితర పనులకు సంబంధించి ప్యాకేజీ 63లో రూపొందించారు. మొదట్లో ఈ పనులకు రూ.72.81 కోట్ల అంచనాతో 24 నెలల్లో పూర్తయ్యే విధంగా 2005లో చేపట్టి 2007లో పూర్తిచేయాలని అగ్రిమెంట్ జరిగింది. ఆ తర్వాత ఈ పనులను 2019 మే నెలాఖరుకు పూర్తిచేయాలని పొడిగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కేవలం రూ.41.30 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం ఎనిమిది స్ట్రక్చర్లు పూర్తిచేయాల్సివుంది. ఇందులో మూడు పూర్తయ్యాయి. ఇంకా ఐదు స్ట్రక్చర్ల పని జరుగుతోంది. మట్టి తవ్వకం పని 51.95 శాతం, స్ట్రక్చర్ల పని 37.5 శాతం పూర్తయింది. ప్యాకేజీ 64లో కుడివైపు కనెక్టివిటీల్లో భాగంగా 880 మీటర్ల పొడవైన సొరంగం తవ్వకం చేయాల్సివుంది. 2005 మార్చి 11న రూ.73.90 కోట్ల అంచనా విలువతో ఈ పనులను 24 నెలల్లో పూర్తిచేయాలని అగ్రిమెంట్ కుదిరింది. ఈ సొరంగం పనులను కూడా 2019 మే నెలాఖరుకు పూర్తిచేసేలా గడువు పొడిగించారు. ఇప్పటివరకు రూ.56.61 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. మట్టి తవ్వకం పని 96.82 శాతం, లైనింగ్ పని 20.36 శాతం పూర్తయింది. ఒకే స్ట్రక్చర్ నిర్మించాల్సి వుండగా ఇంకా పని జరుగుతూనేవుంది.
ఇక ప్యాకేజీ 65లో 919 మీటర్ల పొడవున ఎడమ వైపు సొరంగం నిర్మించాల్సివుంది. ఈ పనిని 90.99 కోట్ల అంచనాతో సప్లిమెంటరీ అగ్రిమెంట్‌లో మరో రూ.12.92 కోట్లు మొత్తం రూ.103.91 కోట్ల అంచనాతో రెండేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయించారు. అయితే రూ.15.46 కోట్ల విలువైన పని పూర్తయిన తర్వాత పనులు ముందుకు జరగలేదు. అగ్రిమెంట్ రద్దుచేసి, కొత్త టెండర్లు పిలిచారు. వాస్తవానికి ఈ ప్యాకేజీలో కేవలం 28.15 శాతం మేరకు మట్టి తవ్వకం పని మాత్రమే జరిగింది. పాత కాంట్రాక్టు సంస్థకు రూ.7.63 కోట్లు మొబిలైజేషన్ నిధులు ఇచ్చారు. ఆ మొత్తానికి వడ్డీ రూపేణా సుమారు రూ.89 వేలు వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే కొత్త ఏజెన్సీని ఇంకా నిర్ణయించి పనులు అప్పగించలేదు.
అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపే పోలవరం హెడ్ వర్క్సులో భాగంగా ప్యాకేజీ 66లో 890 మీటర్ల పొడవున సొరంగం తవ్వకం చేయాల్సివుంది. ఈ పనికి మొదట్లో రూ.90 కోట్ల అంచనాతో అగ్రిమెంట్ చేసినప్పటికీ ఆ తర్వాత రూ.12.92 కోట్లను తగ్గించి రూ.77.08 కోట్లతో అగ్రిమెంట్ కుదిరింది. ఈ పని కూడా వాస్తవానికి రెండేళ్లకు పూర్తి కావాల్సివుంది. ఆ తర్వాత షరా మామూలుగానే 2019 మే చివరికి పూర్తి చేయాల్సిందిగా అగ్రిమెంట్ గడువును పొడిగించారు. ఇప్పటి వరకు రూ.40.32 కోట్ల విలువైన పనులు జరిగాయి. మట్టి తవ్వకం పని 72.09 శాతం, స్ట్రక్చర్ల నిర్మాణం కేవలం 33 శాతం పూర్తయింది. మొత్తం మూడు స్ట్రక్చర్లు నిర్మించాల్సి వుండగా అందులో రెండు పూర్తి కాగా, ఒకటి నిర్మాణంలో వుంది. ఈ పనికి అడ్డంకిగా వున్న శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ పైపులైన్‌ను తొలగించాల్సివుంది. ఇందుకయ్యే ఖర్చు నిమిత్తం కూడా ప్రభుత్వం గ్రామీణ మంచినీటి సరఫరా శాఖకు రూ.10.50 కోట్లు డిపాజిట్ కూడా చేసింది. కానీ పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వున్నాయి. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కీలకమైన సొరంగం పనుల్లో మాత్రం అనుకున్నంత పురోగతి కనిపించడంలేదు.