రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 21: నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ కేంద్రం నుంచి నింగిలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ముందు రోజు ఇస్రో చైర్మన్‌గా ఉన్నవారు శ్రీవారిని దర్శించుకోవడం, ఉపగ్రహ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేయడం సాంప్రదాయంగా పాటిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 5.30 గంటలకు శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్‌వీసీ-46 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా ఆయనకు అధికారులు దర్శన ఏర్పాటు చేశారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల శివన్ విలేఖరులతో మాట్లాడుతూ 615 కిలోల బరువున్న విశాట్ 2, బిఆర్ 1 ఉపగ్రహాన్ని బుధవారం నింగిలోకి పంపుతామన్నారు. దీని కాలపరిమితి 5 సంవత్సరాలని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారి కదలికలపై నిశిత దృష్టిని సారించే వీశాట్ 2 ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. అంతకుముందు ఆయన ఇతర శాస్తవ్రేత్తలతో సూళ్లూరుపేట చెంగాళమ్మ దేవస్థానంలోనూ, శ్రీకాళహస్తిలోని ముక్కంటీశుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్