రాష్ట్రీయం

జూన్ తర్వాత మళ్లీ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, ఏప్రిల్ 11: కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం జూన్ తర్వాత భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. మార్చి నుండి మే వరకు విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయం కాబట్టి వారి చదువులకు ఆటంకం కలిగించకూడదనే అభిప్రాయంతో రెండోసారి ఉద్యమాన్ని వాయిదా వేశామని అన్నారు. తుని కాపు గర్జనలో పాల్గొన్న కాపు నాయకులకు కృతజ్ఞతలు చెప్పడానికి సోమవారం ఉదయం ఆయన గుంటూరు జిల్లా పొన్నూరు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపునాడు కోశాధికారి కోట శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ముద్రగడ మాట్లాడారు.
కాపుల సంక్షేమానికి ఆరు నెలల్లోగా వెయ్యి కోట్లు కేటాయిస్తానని 2014 ఎన్నికల వాగ్దానంతో హోరెత్తించి ఓట్లు పొంది గద్దెనెక్కిన చంద్రబాబు హామీల అమలును అశ్రద్ధ చేయడం వల్లే తాను ఉద్యమ బాట పట్టినట్లు స్పష్టం చేశారు. పేద కాపుల బతుకులు బాగుపడాలని చేపట్టిన తమ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వెనుకంజ వేయలేదన్నారు. కొందరు కాపు నేతలకు ఆశలు చూపి ఉద్యమాన్ని దెబ్బతీయాలని అధికార పార్టీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు.
కాపులకు న్యాయం చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని, మిగిలిన వెనుకబడిన కులస్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జూన్ తర్వాత అవసరమైతే ఉద్యమిస్తామని, అప్పటిలోగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తిరిగి ఉద్యమానికి బాసటగా నిలిచిన కాపులను కలుసుకుని కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఈ పర్యటన ఆరంభించినట్లు ముద్రగడ వివరించారు.