రాష్ట్రీయం

భద్రాద్రి క్షేత్రం మహాద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీరామక్షేత్రం మహాద్భుతంగా ఉందని, ఒక ముఖ్య పనిమీదే తాను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చానని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, అయోధ్య వివాద పరిష్కార త్రిసభ్య కమిటీ సభ్యులు పండిట్ రవిశంకర్ పేర్కొన్నారు. జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావుతో కలిసి ప్రత్యేక హెలీకాప్టర్‌లో బుధవారం రవిశంకర్ భద్రాచలం వచ్చారు. ఈ సందర్భంగా రామాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ఈఓతో పాటు అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలకగా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భద్రాచలంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ఆలయ విశిష్టతను, అభివృద్ధిని ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ రమేష్‌బాబు ఆయనకు వివరించి ఆలయాభివృద్దికి చేయూతనివ్వాలని కోరారు. భద్రాచలం పర్యటనలోని ప్రాధాన్యం గురించి రవిశంకర్‌ను విలేఖర్లు ప్రశ్నించగా ఒక ముఖ్యమైన పనిమీదే భద్రాచలం వచ్చానని, దానిపై ఇప్పుడు చెప్పడం సమంజసం కాదని, పూర్తి వివరాలు త్వరలో తెలుపుతానని చెప్పారు. అనంతరం ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ సభ్యులకు సందేశం ఇచ్చారు.

చిత్రం... భద్రాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, గ్రంథి మల్లికార్జునరావు