రాష్ట్రీయం

అంతలోనే ఇంత మార్పా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రజల్లోని నిశబ్ధ చైతన్యాన్ని ఏ ఎగ్జిట్ పోల్ పసిగట్టలేకపోయింది. రాజకీయ పక్షాలు, మీడియా సంస్థలు, మేధావి వర్గాలకు సైతం అంతుచిక్కని ప్రజానాడీకి పార్లమెంట్ ఫలితాలు అద్దం పట్టాయి. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది, అదే పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో ఉండవచ్చని ప్రతి ఒక్కరూ ఆశించారు... అయతే పప్పులో కాలేసేలా ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు నెలల కిందటి శాసనసభ ఫలితాలకు, నేటి ఫలితాలకు మధ్య ఎంత తేడా... అంతలోనే ఎంత మార్పు...! ప్రజల్లో నిశబ్ధ చైతన్యానికి, ఓటర్ల విజ్ఞతకు ముందు ఎంతటి బలమైన రాజకీయ శక్తి కూడా తలవంచక తప్పదని నిరూపించాయి ఈ ఫలితాలు. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టిన విజయం తమదేనని టీఆర్‌ఎస్ అతి విశ్వాసానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దింపిన అభ్యర్థులకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేదన్న విమర్శలకు ‘ప్రజలు సార్‌ను చూసి ఓట్లు వేస్తారు తప్ప అభ్యర్థులను చూసి కాదు’ అని స్వయంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్య ఇక్కడ గమనర్హం.
కేటీఆర్ ధీమాకు శాసనసభ ఎన్నికల ఫలితాలు కారణం అయి ఉండవచ్చు. శాసనసభ ఎన్నికల్లో సిట్టింగ్‌లందరికి టిక్కెట్లు ఇవ్వడంతో పాటు ఒకేసారి అభ్యర్థుల జాబితా ప్రకటించడం ఎంతో సాహోసోపేత చర్య. కేటీఆర్ చెప్పిన విధంగా ఆ ఎన్నికల్లో ప్రజలు ‘సార్’ను చూసి (కేసీఆర్) ఓట్లు వేసి ఉండవచ్చు. అయితే అన్ని వేళల పరిస్థితి ఒకేలా ఉండదన్న దానికి ఈ ఫలితాలు ఒక కనువిప్పు. ఏకపక్ష నిర్ణయాలకు పర్యావసాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చవి చూడక తప్పలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ‘సార్’ను చూసి కాకుండా అభ్యర్థులను చూసి ఓట్లు వేసినట్టు స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభంజనం ముందు తమ అంచనాలు తలకిందులయ్యాని టీఆర్‌ఎస్ సమర్దించుకోలేని పరిస్థితి. ఒక్క బీజేపీనే కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా అనూహ్య విజయం సాధించడం ఇది పూర్తిగా టీఆర్‌ఎస్ అతి విశ్వాసానికి, ప్రత్యర్థులను తక్కువగా అంచన వేయడమే. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఉత్తర తెలంగాణలోనే కాకుండా ఇటు దక్షిణ తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్‌కు గట్టి షాకే తగిలింది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మూడు జిల్లాలోనే కాకుండా ఇటు దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, నల్లగొండ స్థానాల్లో ప్రత్యర్థులకు దక్కిన ఓట్లు టీఆర్‌ఎస్‌కు కనువిప్పు కలిగించేలా ఉన్నాయి. రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్‌ను, మల్కాజ్‌గిరి నుంచి మంత్రి సిహెచ్ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని, నల్లగొండ నుంచి రియల్డర్ నరసింహారెడ్డిని బరిలోకి దించడం వల్ల టీఆర్‌ఎస్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. అన్నింటికంటే మించి నిజామాబాద్ నుంచి సీఎం కేసీఆర్ కూతురు కవిత సైతం ఎన్నికల్లో ఎదురీడటానికి కారణం ఏమిటీ?. పార్లమెంట్ ఎన్నికలలో ఉహించని ఫలితాలకు కారణం ఏమిటీ? లోపం ఎక్కడ జరిగింది?. పార్టీలో సమన్వయం లోపించిందా? పార్టీ ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు హర్షించరా? పార్టీ శ్రేణులు ఆదరించరా? తదితర అంశాలపై టీఆర్‌ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని పార్లమెంట్ ఫలితాలు గుర్తు చేశాయని చెప్పవచ్చు.

- వెల్జాల చంద్రశేఖర్