రాష్ట్రీయం

రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: అన్యాయాలు చేస్తే దేవుడు ఎలా మొట్టికాయలు వేస్తాడన్న సంగతి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఉదంతం చూస్తే తెలుస్తుందని వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని, 2024లో మరింత గొప్ప తీర్పు రావాలంటూ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో శనివారం వైకాపా శాసభసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం జగన్ మాట్లాడుతూ వైకాపాను ప్రలోభపెట్టి అన్యాయంగా, అధర్మంగా 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేస్తే, మే 23న చివరికి టీడీపీకి 23 ఎమ్మెల్యేల సీట్లు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇంత గొప్ప స్క్రిప్ట్ ఎప్పుడూ కూడా ఉండదని, దేవుడు అంత గొప్పగా రాశారన్నారు.
175 నియోజకవర్గాల్లో 151, 25 ఎంపీ స్థానాల్లో 22స్థానాల్లో స్వీప్ చేయగలగడం, 50 శాతం ఓటింగ్ వైకాపాకు రావడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమన్నారు. ప్రజలు వైకాపాపై ఎంతో నమ్మకం, విశ్వాసం పెట్టుకున్నారన్నారు. విశ్వసనీయత అన్న పదానికి ఓటేశారన్నారు. ప్రజలు గొప్ప బాధ్యతను మన భుజాలపై మోపిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. 2019 అయిపోయిందని, ఇక 2024 ఎన్నికలు లక్ష్యం కావాలన్నారు. మనం చేసిన పనుల వల్ల ఇంతకన్నా గొప్ప తీర్పు 2024లో రావాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ఎవ్వరూ చూడని రీతిలో ప్రక్షాళన చేస్తానన్నారు. దీనికి ఎమ్మెల్యేలు సహాయం, సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గడచిన 9 ఏళ్ల కాలంలో ప్రజలకు ప్రతి అడుగులోనూ, ప్రతి నిమిషం ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, అక్కడ వైకాపా కనిపించిందన్నారు. ఏ సమస్య వచ్చినా తాను అక్కడకు వెళ్లి పోరాటం చేశానని, చేసిన ప్రతి కార్యక్రమం ప్రజల మన్ననలు చూరగొందన్నారు. ఫలితంగానే నేడు అధికారంలోకి వచ్చామన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్తతో సహా నాయకులంతా తోడుగా ఉండటం వల్ల మనకు ఈ గొప్ప గెలుపు వచ్చిందన్నారు. ఆరు నెలలు తిరిగే సరికి మంచి ముఖ్యమంత్రిని అనిపించుకునేలా పాలన సాగిస్తామని హామీ ఇచ్చారు.