రాష్ట్రీయం

తిరుమలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 26: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా ఆదివారం తిరుమలకు చేరుకున్నారు. మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు వైకాపా ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆదిమూలం, నవాజ్ బాషా, జిల్లా అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డుమార్గాన తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని పద్మావతి అతిధిగృహం వద్దకు రాగానే టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కాగా రాత్రికి తిరుమలలోనే కేసీఆర్ బస చేస్తారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. కాగా కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు పెద్దఎత్తున పోలీసులను మోహరించారు.