రాష్ట్రీయం

ఎండలతో రాష్ట్రం అగ్ని గుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా వేడి గాలులు భారీగా వీస్తున్నాయి. రోహిణీ కార్తెలో తీవ్రమైన ఎండలు ఉంటాయన్న హైంద వ సాంప్రదాయం నిజమేనని వాస్తవ పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. ఆదివారం చాలా చోట్ల 45 నుండి 47.8 డిగ్రీలు సెల్సియస్‌వరకు నమోదయ్యాయి. జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ సూర్యాపేట జిల్లాలోని చాలా చోట్ల 47 డిగ్రీలు ఆపైగా నమోదయ్యా యి. ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన
తేదీగా ఆదివారం రికార్డు సృష్టిస్తోంది. ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సొసైటీ వాతావరణ ‘వార్నింగ్’ ప్రకటించింది. అంటే ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 30 వరకు తెలంగాణ మొత్తంలో వడగాడ్పులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) కేంద్రాలు పరిమితంగా ఉండటంతో ఒకే ఒక కేంద్రంలో మాత్రం అత్యధికంగా 46 డిగ్రీలు మాత్రమే నమోదైంది. ప్లానింగ్ సొసైటీకి రాష్ట్రంలో 900 ప్రాంతాల్లో వాతావరణం కొలిచే యంత్రాలు ఉన్నాయి. దీని ప్రకారం 47 డిగ్రీలుపైగా నమోదైన కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
-------------------------------------------
జిల్లా మండలం గ్రామం ఉష్ణోగ్రత
----------------------------------------
మంచిర్యాల వేంపల్లి నీల్వాయి 47.8
జగిత్యాల వెల్గటూరు ఎండపల్లి 47.7
జగిత్యాల ధర్మపురి ధర్మపురి 47.7
జగిత్యాల మేడిపల్లి మేడిపల్లి 47.5
జగిత్యాల ధర్మపురి జైనా 47.6
భూపాలపల్లి రేగొండ కొత్తపల్లెగోరి47.5
జగిత్యాల బీర్పూర్ కొల్వాయి 47.4
జగిత్యాల జగిత్యాల(ఆర్)పొలాస 47.4
మంచిర్యాల జన్నారం జన్నారం 47.4
జగిత్యాల సారంగపూర్‌సారంగపూర్47.4
జగిత్యాల ఇబ్రహీంపట్నంగోధూర్ 47.4
మహబూబాబాద్ కురవిఅయ్యగారిపల్లి 47.3
మహబూబాబాద్ నర్సింహులుపేట 47.2
భూపాలపల్లి ములుగు మల్లంపల్లి 47.1
భూపాలపల్లి ఘన్‌పూర్ చేల్పూర్ 47.1
కరీంనగర్ జమ్మికుంట జమ్మికుంట 47.1
సూర్యాపేట పాలకీడు అలంగాపురం47.1
కరీంనగర్ జమ్మికుంట తంగుల 47.0
జగిత్యాల మెట్‌పల్లి మెట్‌పల్లి 47.0