రాష్ట్రీయం

షార్‌కు చేరిన ఉపగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 11: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో నావిగేషన్ సేవలకు సంబంధించిన ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుండి ఈ నెల 28న పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ఉపగ్రహం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుండి రోడ్డు మార్గాన అత్యంత భారీ భద్రత నడుమ సోమవారం షార్‌కు చేరింది. నావిగేషన్ సిరీస్‌లో ఇది చివరి ప్రయోగం. ఇప్పటి వరకు ఇస్రో ఆరు ప్రయోగాలు విజయవంతంగా చేపట్టింది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ నెల 28న మధ్యాహ్నం 12:59 గంటలకు 1425 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జిపిఎస్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కక్ష్యలోకి పంపించిన ఆరు ఉపగ్రహాలు తన సేవలను అందిస్తున్నాయి. ఇప్పటికే రాకెట్ తొలి దశ అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేసి రెండో దశలో పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మూడో అనుసంధాన పనులు పూర్తయినంతరం ఉపగ్రహానికి వివిధ పరీక్షలు నిర్వహించి రాకెట్ చివరి భాగంలో అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. ఈ ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం ఈ నెల 25న డాక్టర్ సురేశ్ అధ్యక్షతన షార్‌లో జరగనుంది. ఎంఆర్‌ఆర్ అనంతరం అదేరోజు లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు వారు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలపనున్నారు. అన్ని సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 28న మధ్యాహ్నం 12:59 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి పిఎస్‌ఎల్‌వి-సి 33 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

చిత్రం భారీ భద్రత నడుమ షార్‌కు వస్తున్న
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహం