ఆంధ్రప్రదేశ్‌

రామయ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 11: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వసంత పక్ష నవాహ్నిక తిరుకల్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి బేల మంటపంలో నూతన స్వర్ణ కవచ ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేశారు.
బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే రుత్విక్కులకు, సిబ్బందికి దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి దీక్షా వస్త్రాలను అందజేశారు. అనంతరం సాయంత్రం ఆరాధన నిర్వహించాక బ్రహ్మోత్సవాల అంకురార్పణ కోసం గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి పుట్టమన్ను తెచ్చారు. యాగశాలలో పుట్టమన్నును ఉంచి అఖండ దీపారాధన చేశారు. నవధాన్యాలతో అంకురార్పణ జరిగింది. ద్వారతోరణ పూజ, వాస్తుపూజ, అంకురార్పణ హోమం, వాస్తు హోమం జరిపి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అంతకుముందు ఆచార్య, బ్రహ్మ, రుత్విక్కులంతా వెళ్లి అంతరాలయంలో మూలవరుల అనుజ్ఞ తీసుకున్నారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

చిత్రంస్వామివార్లకు ఉత్సవాంగ స్నపన తిరుమంజనం