ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణులు రాజకీయాల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 11: అర్చకత్వం అనేది మతపరమైన బానిసత్వంలా మారిందని, అర్చకుల సంక్షేమం కోసం పట్టించుకునే నాథుడే కరవయ్యాడని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఆవేదన వ్యక్తంచేశారు. వ్రత పురోహితులకు కనీసం రూ.5000 జీతం చెల్లించేలా దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. కాకినాడలోని కన్నయ్యకాపునగర్‌లో బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. గతంలో ప్రభుత్వం గ్రామీణ అధికార వ్యవస్థను రద్దు చేయడంతో బ్రాహ్మణులు బాగా దెబ్బ తిన్నారని, విద్యపై దృష్టిపెట్టిన వారు బాగుపడినా, మిగిలిన బ్రాహ్మణులు కడు దారిద్య్రంలో మగ్గుతున్నారన్నారు. ఎల్‌కెజి ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న బ్రాహ్మణులే వేద పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి, సహకరించడానికి వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేశారన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి, ఆ కుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి ముందుకువచ్చారని ప్రశంసించారు. బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 20-30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ముందుకువచ్చి, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను అత్యంత పారదర్శకంగా, ఆన్‌లైన్ విధానంలో జరిగేలా చూస్తామన్నారు. భార్గవ్ మేచింగ్ స్కీంతో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, విశ్వనాథ ఆరామ క్షేత్రాలు, వృద్ధాశ్రమాల నిర్మాణంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. బ్రాహ్మణ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి 50 శాతం నిధులు కార్పొరేషన్ సమకూరుస్తుండగా, మరో 50 శాతం నిధులను బ్రాహ్మణ సంఘాలు భరించాల్సి ఉంటుందన్నారు. ఇంటర్ నుండి పిజి, ఇంజనీరింగ్, మెడిసిన్ చదివే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం ఇస్తామన్నారు. సివిల్స్ సహా వివిధ రకాల పోటీ పరీక్షలకు పేద బ్రాహ్మణ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు కృష్ణారావు వివరించారు. కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దంటు సూర్యారావు, కాకినాడ నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ ఎస్ గోవిందస్వామి, శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు

.chitram సమావేశంలోమాట్లాడుతున్నఐవైఆర్‌కృష్ణారావు