రాష్ట్రీయం

అవినీతిపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 4: అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా అవినీతి నిర్మూలనే తక్షణ కర్తవ్యమని, ప్రస్తుతం అమలులో ఉన్న టెండర్ల ప్రక్రియకు స్వస్తిచెప్పి రివర్స్ టెండరింగ్ విధానాన్ని తెస్తామని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. టెండర్ల ఖరారుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు. ఇందులో భాగంగా మంగళ వారం ఉండవల్లిలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా సీజెను మర్యాదపూర్వకంగా కలుసుకోవటంతో పాటు కాంట్రాక్ట్ పనుల్లో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుపై చర్చించారు. ఇందుకోసం హైకోర్టు న్యాయమూర్తి ఒకరిని నియమించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఏర్పాటు కానున్న జ్యుడీషియల్ కమిషన్‌కు ప్రభుత్వ పనులకు సంబంధించిన వివరాలను అంచనాలతో సహా అందజేస్తారు. కమిషన్ వాటిని పరిశీలించి అంచనాల్లో ఏవైనా సవరణలు ఉంటే సూచిస్తుంది. అనంతరం టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ రకమైన విధానం దేశంలోనే తొలిసారి. ప్రస్తుతం పోలవరం, రాజధాని నిర్మాణంతో పాటు రహదార్లు, ఇతర భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, గ్రామాల్లో వౌలిక వనరుల అభివృద్ధికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల్లో జరుగుతున్న ఈ పనులపై పర్యవేక్షణ లేకపోవటంతో కాంట్రాక్టర్లతో పాటు కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అభియోగాలు గత ప్రభుత్వ హయాంలో వచ్చాయి. వీటిని కట్టడి చేయటం ద్వారా పారదర్శకంగా పనులు, నిర్మాణాలు చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏసీజేతో భేటీ అయ్యారు.
చిత్రం... హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి