రాష్ట్రీయం

జనం మన్ననే రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 4: విశాఖ శ్రీ శారదాపీఠాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. నవ్యాంధ్ర రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా విశాఖ వచ్చిన జగన్ శ్రీ శారదాపీఠంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన స్వామీజీతో కొంతసేపు ఏకాంతంగా చర్చించారు. జగన్ తలపెట్టిన పాదయాత్ర ప్రారంభానికి ముందు శ్రీ శారదాపీఠాన్ని సందర్శించి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయం అనంతరం గత నెల 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్, తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఉదయం 10 గంటలకే సీఎం జగన్ పీఠానికి చేరుకోవాల్సి ఉండగా, రెండు గంటల ఆలస్యంగా పర్యటన మొదలైంది. మధ్యాహ్నం 2.30 గంటలకు జగన్ విజయవాడకు తిరుగుపయనమయ్యారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా శారదాపీఠానికి చేరుకున్న జగన్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం జగన్ సంప్రదాయ దుస్తులతో పీఠ ప్రాంగణంలోని శ్రీ రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠ ప్రాంగణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి, వల్లీదేవ సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. స్వామి వారికి పండ్లు, పూలు, పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం స్వామీజీ జగన్‌ను ఆశీర్వదించి జన రంజకంగా పాలించి ప్రజల మన్ననలు పొందాలని ఆశీర్వదించారు. అనంతరం సీఎం జగన్ సుమారు 40 నిముషాల పాటు స్వరూపానంద స్వామితో ఏకాంతంగా పలు అంశాలపై చర్చించారు. త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ముహూర్తం ఖరారు సహా పలు అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. పీఠంలో సీఎం జగన్ పర్యటన జరుగుతున్నంత సేపు స్వామీజీతో పాటు ఉత్తర పీఠాధిపతి బాలస్వామి పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ స్వామి వారి ప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన వెంట పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం... విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ
ఆశీస్సులు తీసుకుంటున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి