రాష్ట్రీయం

ముంబై ఐఐటీలో సీఎస్సీ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, జూన్ 4: ముంబై ఐఐటీ నుండి సీఎస్సీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి, సివిల్ సర్వీసుకు హాజరై ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని ఏపీ ఎంసెట్-2019 ఇంజినీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన కురిశేటి రవి శ్రీతేజ తెలిపాడు. మంగళవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించిన సందర్భంగా రవి శ్రీతేజ తన మనోగతాన్ని వెల్లడించాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన నాగవెంకట ఉమామహేశ్వరగుప్త, గీత దంపతుల కుమారుడైన రవిశ్రీతేజ స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఎల్‌కేజీ నుండి ఆరో తరగతి వరకు చదివాడు. అనంతరం ఇంటర్ వరకు విజయవాడలోని శ్రీచైతన్యలో విద్యాభ్యాసం చేశాడు. రవిశ్రీతేజ జేఈఈ మెయిన్స్‌లో 350కు 337 మార్కులు సాధించి, 136వ ర్యాంకు పొందాడు. అలాగే బిట్‌శాట్‌లో సైతం 450కి 450 మార్కులు సాధించాడు. రవిశ్రీతేజ తండ్రి నాగవెంకట ఉమామహేశ్వరగుప్త తాడేపల్లిగూడెంలో ఆఫ్‌సెట్ ప్రింట్రింగ్ ప్రెస్ నిర్వహిస్తుంటారు. రవిశ్రీతేజను పలువురు అభినందించారు.

చిత్రం... ఇంజినీరింగ్ ఫస్ట్ ర్యాంకర్ రవి శ్రీతేజ