రాష్ట్రీయం

కాంగ్రెస్‌లోనే కొనసాగుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూన్ 4: రాజకీయాల్లో తనకు ఓపిక ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీలు మారే ప్రసక్తే లేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అధికారం ఉన్నప్పుడు ఒక పార్టీ, లేనప్పుడు మరో పార్టీ మారితే అలాంటి వారికి రాజకీయాలపై సరైన అవగాహన ఉండదన్నారు. పార్టీలు మారితే స్వర్గంలో బానిసలుగా ఉండాల్సి ఉంటుందని, దానికంటే నరకంలో రాజుగా ఉండటం ఎంతో మజాగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇటీవల
జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓటమి చెందిన వారిలో 58 మంది పార్టీలు మారారని, అయితే మరో 9 మంది ఇదే పార్టీలో కొనసాగుతున్నారన్నారు. కష్టమైనా, సుఖమైనా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానన్నారు. పార్టీలు మారే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికల్లో విజయం సాధించలేదని పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను రాహుల్‌గాంధీ ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను ఇప్పటికే ఆరేళ్లు పూర్తి చేసుకున్నానని, కొత్త వారికి అవకాశం కల్పించాలని గత నెలలో రాజీనామా లేఖ పంపానన్నారు. ఈనెల 9వ తేదీ ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తున్నారని, అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ప్రధానితో మాట్లాడేందుకు సమయం కేటాయించాలని కోరుతూ లేఖ రాస్తున్నామన్నారు. ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని, విభజన హామీలు అమలు చేయాలని వినతిపత్రం అందచేస్తామన్నారు. ఇదే విషయపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పరంగా లేఖ రాస్తూ అందుకు సహకరించాలని కోరామన్నారు. ప్రత్యేక హోదాపై జగన్ ప్రధానితో చర్చించాలని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ సాధనకు కృషి చేయాలని రఘువీరా కోరారు.
చిత్రం... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి