రాష్ట్రీయం

పది రోజులే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 4: కాళేశ్వరం బ్యారేజీ పనులను జూన్ 15 నాటికి పూర్తి చేసి జూలై నెలలో రైతాంగానికి సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ పనుల పురోగతిని మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి 15 రోజుల వ్యవధిలోనే మేడిగడ్డ బ్యారేజీ పనుల పురోగతి పరిశీలన కోసం రెండోసారి రావడం విశేషం. మేడిగడ్డ బ్యారేజీతో పాటు కనె్నపల్లి పంపుహౌస్ పనులు జూలై 15 నాటి కల్లా పూర్తి చేయాలని ఇంజనీరింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీలో 85 గేట్లకు గాను 85 గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తయింది. బ్యారేజీలోని 8 బ్లాకులలో సీల్ పనులు ఇప్పటి వరకు 25 పూర్తి చేశామని, మిగతా బ్లాకులలో పనులు పూర్తి దశలో ఉన్నాయని సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారులు వివరించారు. ఉదయం 7:45 గంటలకు షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి రావలసివుండగా 10 గంటలకు మేడిగడ్డకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. రెండు నిమిషాల పాటు బ్యారేజీ చుట్టూ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి వ్యూ పాయింట్ వద్దకు చేరుకొని బ్యారేజీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం బ్యారేజీ బ్రిడ్జి నుంచి అవతలి మహారాష్ట్ర వైపుకు వెళ్లి రెండు గంటల పాటు బ్యారేజీలో 8 బ్లాకులలో జరుగుతున్న పనులను కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. ప్రతి బ్లాకులో తిరుగుతూ పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ మొదటి బ్లాకు రెండో గేటు మధ్య కాలినడకన వెళ్లి గోదావరి నీటిలో నాణేలు చల్లి గోదావరికి నమస్కరించారు. మేడిగడ్డ బ్యారేజీకి రైట్ బాండ్ 6.3 కిలో మీటర్ల పని పూర్తి కాగా లెఫ్ట్ బాండ్ 11.7 కిలో మీటర్లు కరకట్ట పనులు పూర్తి జరిగాయని, మధ్యలో ఉన్న నాలాల పనులు జరగాల్సివుందని, దీనిని పది రోజుల్లో పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. అనంతరం మేడిగడ్డ క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించి తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
కేసీఆర్ వెంట ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి మురళీధర్‌రావు, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, ఐజీ నాగిరెడ్డి, రిటైర్డు ఐజీ ఎన్.కే.సింగ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్.్భస్కరన్, కాటారం ఏ ఎస్పీ సాయిచైతన్య, ఎల్ అండ్ టీ ప్రతినిధి రాజుతో పాటు మేడిగడ్డ ఈఈ రమణారెడ్డి, డీఈ సురేష్, తిరుపతి తదితరులు ఉన్నారు.

చిత్రం... కాళేశ్వరం బ్యారేజీ పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్