రాష్ట్రీయం

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: నానాటికీ వాతావరణ కాలుష్యం పెరుగుతున్నందున వాటి నుంచి రక్షించుకోవడానికి మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ సూచించారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రైల్వే కాలనీలో జీఎం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్‌లో పచ్చదనం మరింత పెంచాల్సిన అవసరాన్ని ఉద్యోగులకు వివరించారు. రైల్వే జోనల్ పరిధిలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్‌లలో ఖాళీగా ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్యోగులు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వాహనాలు షేరింగ్ చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు బస్సు, సైకిల్ లైదా రైలు ప్రయాణాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కాలుష్యంపై అవగాహన కల్పించడానికి ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జోన్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్‌న్లలో ఉద్యోగులు, ప్రయాణికులతో మొక్కలు నాటించి పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు.

చిత్రం... సికింద్రాబాద్ రైల్వే కాలనీలో ఉద్యోగుల ర్యాలీ