రాష్ట్రీయం

క్రిమినల్ కేసులున్న అమిత్ షాకు కేంద్ర హోంమంత్రి పదవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని సమర్థిస్తామని, అయితే అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేసే విధంగా ప్రజలిచ్చిన మెజార్టీని ఉపయోగించుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. గుంటూరులో బుధవారం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నారాయణ మాట్లాడుతూ దేశంలో బీజేపీకి సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించిందన్నారు. ఈ మెజారిటీ ప్రజాస్వామ్యం పైనా, సెక్యులరిజంపైనా దాడిచేసే విధంగా మారుతోందని విమర్శించారు. 12 మందిని ఎన్‌కౌంటర్ చేయించిన వ్యక్తిని హోం మంత్రిని చేయడం దురదృష్టకరమన్నారు. అమిత్‌షాపై 4 క్రిమినల్ కేసులున్నాయని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని హోంమంత్రిని చేయడం సరికాదన్నారు. బీజేపీలో 57 మంది మంత్రులు ఉంటే వారిలో 52 మంది కోటీశ్వరులే ఉన్నారన్నారు. హోంమంత్రితో సహా 26 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయన్నారు. దేశంలో నూటికి 80 మంది పేదవారు ఉంటే, 20 మంది కోటీశ్వరులు ఉన్నారన్నారు. ప్రజల బాధలకు, ప్రభుత్వ పాలనకు మధ్య వ్యత్యాసం ఏర్పడిందని, ఇది ఉన్నంతకాలం ప్రజా సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రాంతీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచిపాలన అందిస్తే జగన్ నాలుగు కాలాలపాటు ఉంటారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా పాలన అందించాలన్నారు. లోప భూయిష్టంగా ఉన్న ఎన్నికల విధానాన్ని సంస్కరించకుంటే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యం కాదన్నారు. దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిపించాలన్నారు. ప్రజలకు నిజమైన పాలన కావాలంటే దళితులు, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజలు దామాషా ఎన్నికలు జరిపించాలని కోరుతున్నారన్నారు.
అందుకే రానున్న రోజుల్లో దేశం మొత్తం దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిపించాలని, దీని సాధనకై ఉద్యమం సాగిస్తున్నారని తెలిపారు. ఈవీఎంల్లో అనేక లోపాలు కనిపించాయని, పోలైన ఓట్లతో పోల్చుకుంటే లెక్కించిన ఓట్లలో తేడాలు ఉన్నాయని తెలిపారు. ఈవీఎంలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో వామపక్షాలకు చేదు అనుభవం ఎదురైందని, వామపక్షాలన్నీ ఒకే గొడుగు కిందకు రావాలని, కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాల్సిన ఆవశ్యకత ఉందని నారాయణ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ