రాష్ట్రీయం

చంద్రబాబు విదేశీ పర్యటన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 6: త్వరలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకూ విదేశాలకు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేందుకు ఆయన నిర్ణయించారు. తిరిగి ఈ నెల 15న వచ్చేలా పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం అవుతాయన్న భావిస్తున్న నేపథ్యంలో పార్టీ వర్గాలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తగిన దిశానిర్దేశం చేసేందుకు వీలుగా తన పర్యటను చంద్రబాబు వాయిదా వేసుకున్నారు.