తెలంగాణ

ప్రాణం పోద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: రాష్ట్రంలో ప్రతీ 75 వేల జనాభాకు ఒకటి చొప్పున అత్యవసర వైద్య సేవలు అందించే 108 అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్న 104 సంచార వైద్య వాహనాల సేవలు మరింత విస్తృతపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర వైద్య సేవలపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి, డిజిపి అనురాగశర్మ, సంబంధిత అధికారులతో సిఎం కె చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించే అంశంలో పోలీసు, వైద్యశాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రమాదాల్లో గాయపడిన వారు మృత్యువాతపడకుండా అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి ప్రధాన రహదారుల వెంట ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారులపై పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు వాహనాల్లో కూడా ప్రాథమిక చికిత్సల కిట్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల తాను ఒక టీవీ లైవ్ షోలో మాట్లాడినప్పుడు 108 ఉద్యోగి రమేష్ ప్రస్తావించిన అంశాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 ఉద్యోగుల వేతనాలను అధికారులతో చర్చించి పెంచాల్సిందిగా వైద్యమంత్రి లక్ష్మారెడ్డిని సిఎం ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష జనాభాకు ఒకటిచొప్పున 108 అంబులెన్స్‌లు 312 ఉండేవని సిఎం పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఇకనుంచి 75 వేల జనాభాకు ఒకటి చొప్పున 108 వాహనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దీంతో 108 వాహనాల సంఖ్య 169కి పెరుగనుండగా, ప్రస్తుతం 145 వాహనాలు పనిచేస్తున్నాయని, మిగతా వాహనాలు కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వస్తాయని సిఎం అన్నారు. అత్యవసర వైద్య సేవల 108 వాహనాలన్నీ అద్భుత సేవలు అందించే విధంగా ప్రభుత్వపరంగా కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. నిర్ణీత తేదీల్లో గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించే 104 సంచార వైద్య వాహనాలు మరింత మెరుగ్గా పని చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన రహదారుల వెంట ప్రమాదాలు జరగటం వల్ల అపారమైన ప్రాణనష్టం జరుగుతుందని, దీనిని నివారించడానికి పోలీసులు, వైద్యశాఖ సంయుక్తంగా కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రధాన రహదారులపై తక్షణమే ట్రామా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ట్రామా కేంద్రాల్లో వైద్య పరికరాలన్నీ అందుబాటులో ఉండాలన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో హెల్త్‌కేర్ సేవలను ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలలో వైద్య సేవలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ పని చేసే వైద్యులకు నగదు ప్రొత్సహం అందించే ప్రతిపాదనలు తయారు చేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులు సమీప పట్టణాలలో నివాసం ఉండేలా వెసులుబాటు కల్పించాలని సిఎం ఆదేశించారు. అదేవిధంగా వైద్యులు కచ్చితంగా సమయ పాలన పాటించి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో నాలుగు పెద్ద ఆస్పత్రులను నిర్మించనుండటంతో వాటి ఏర్పాటుకు స్థలాల గుర్తించాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి అనువైన స్థలాలను ఎంపిక చేసి నిర్మాణాలు ప్రారంభించాలని సిఎం ఆదేశించారు. బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్యశాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పాటు అనేక సంస్కరణలు తీసుకువచ్చామని వాటి ఫలితాలు పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.