రాష్ట్రీయం

హైదరాబాద్ బ్రాండ్‌ను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ బ్రాండ్‌ను కాపాడాలని, గ్రేటర్‌లోని సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్, సీవరేజీ బోర్డు అధికారులకు సూచించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి సోమవారం నాడు పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజీ బిజీగా గడిపేశారు. సీనియర్ అధికారులతో భేటీ అయిన కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయన అంబర్‌పేట పరిధిలోని గోల్నాక, తులసీ రాంనగర్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజాసమస్యలను ఆలకించారు. హోటల్ కత్రియాలో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి ప్రజాసమస్యలపై ఉద్యమించాలని బీజేపీ కార్యకర్తలకు హితవు పలికారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ కాపాడాలంటే జీహెచ్‌ఎంసీ , సీవరేజీ బోర్డు అధికారులదే కీలక పాత్ర అని అన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావల్సిన నిధులను రాబట్టుకుందామని, నిధుల కొరత లేకుండా చేద్దామని, పనులు మాత్రం పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించి దానిని ప్రధాని నరేంద్రమోదీకి అందజేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ అధికారులతో పరిచయం చేసుకున్నారు. వౌలిక వసతుల కల్పనకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర మంత్రి2గా అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తానని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి సైతం తెలుగింటి కోడలేనని ఆమె సహకారం, తోడ్పాటు తెలంగాణకు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. అలాగే కేంద్ర పర్యాటక శాఖా మంత్రి సైతం తెలంగాణకు ఎంతో అనుకూలమైన వ్యక్తి అని అన్నారు. హైదరాబాద్‌లో అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తానని చెప్పారు. సికింద్రాబాద్ అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. నగర కమిషనర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చాలా బాగా జరుగుతున్నాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధికి దోహదం చేయాలని అన్నారు.
ప్రజాసమస్యలపై ఉద్యమం
ప్రజాసమస్యలపై పోరాటాలను ఉద్ధృతం చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు హితవుపలికారు. సోమవారం నాడు హోటల్ కత్రియా ఇంటర్నేషనల్ హోటల్‌లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశంలో డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఉద్యమాలు, పోరాటాల ద్వారానే పార్టీని పటిష్టం చేస్తిమని అన్నారు. బస్తీల్లో ప్రజల సమస్యలపై దృష్టిసారించాలని, ప్రతి సమస్యపైనా పోరాడాలని సూచించారు. 2023లో తెలంగాణలో పాగా వేయాలని, అందుకు జీహెచ్‌ఎంసీలో గెలవడం చాలా కీలకమని అన్నారు. టీఆర్‌ఎస్ అధికారం, డబ్బును ఎదుర్కోవాలంటే కార్యకర్తల పనితీరు ఎంతో మెరుగుపడాలని అన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంల మైత్రిని తిప్పికొట్టాలని చెప్పారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ , ఎంఐఎంలు ప్రత్యామ్నాయం కాదని , బీజేపీనే సరైన ప్రత్యామ్నాయమని డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అయినంత మాత్రాన రాష్ట్ర సమస్యలపై పోరాడకూడదని ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీల వారీ సమావేశాలు నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకుని పనిచేయాలని అన్నారు.
కిషన్‌రెడ్డిని కలిసిన పీవీ సింధు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కేంద్రహోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొన్న టోర్నీలు, విజయాల గురించి వివరించారు.
చిత్రాలు.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్ వచ్చిన
కిషన్‌రెడ్డి సోమవారం సీనియర్ అధికారులతో భేటీ అయిన దృశ్యం
*హైదరాబాద్‌లో సోమవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
కిషన్ రెడ్డిని కలిసిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు