రాష్ట్రీయం

వానాకాలం రైతుబంధు చెల్లిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 2019 వానాకాలానికి సంబంధించి రైతుబంధు పథకం కింద రైతులకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమం ప్రారంభించామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంత్రి కార్యాలయం నుండి అధికారికంగా ఒక ప్రకటన మంగళవారం జారీ అయింది. ఇప్పటికే నాలుగు విడతల్లో ఆర్‌బీఐ ఈకుబేర్ ద్వారా డబ్బు జమచేశామన్నారు. 21.22 లక్షల మంది రైతులకు ఇప్పటికే 2233.16 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. నైరుతీ రుతుపవనాలు త్వరలోనే తెలంగాణకు వస్తాయని, రైతులకు డబ్బు అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పథకం అమలు సమర్థతగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.