రాష్ట్రీయం

కుశ్వంత్‌కు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి: నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో 55వ ర్యాంక్, ఎంసెట్ తెలంగాణ మొదటి ర్యాంక్ సాధించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఎంసెట్ 8వ ర్యాంక్ పొందిన ఎంపటి కుశ్వంత్‌ను మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అభినందించారు. మంగళవారం ‘ఆంధ్రభూమి’ మెయిన్ పేజీలో ‘సీటు రమ్మంటోంది.. ఫీజు పొమ్మంటోంది..’ అనే శీర్షికను కుశ్వంత్‌కు ర్యాంకు వచ్చినా ఆయన ఆర్థిక పరిస్థితి కారణంగా చదువుకోలేని పరిస్థితిని వివరిస్తూ ప్రచురించిన కథనానికి అనూహ్య స్పందన లభించింది. అదే విధంగా హైదరాబాద్‌లో కేటీఆర్ కార్యాలయ అధికారులు కూడా కుశ్వంత్ వివరాలను సేకరించి, కౌన్సిలింగ్‌కు ముందు కలవాలని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. యూఎస్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ రామ్ కుశ్వంత్‌కు సాయమందించనున్నట్టు తెలిపి ‘ఆంధ్రభూమి’ కార్యాలయానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కుశ్వంత్ వివరాలను తెలుసుకొని మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయానికి పిలిపించి కలెక్టర్ వివరాలు సేకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎంసెట్ 2019 అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో ఫస్ట్ ర్యాంక్‌తో పాటు ఆల్ ఇండియా లెవల్‌లో నిర్వహించిన నీట్ పరీక్షలో జనరల్ కేటగిరిలో 55వ ర్యాంక్ సాధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. మారుమూల జిల్లాలో పుట్టినప్పటికీ తండ్రి మృతి చెందినా తల్లి సహకారంతో ఈ స్థాయికి రావడం మామూలు విషయం కాదన్నారు. కుశ్వంత్ విజయం జిల్లాలోని మిగతా విద్యార్థులందరికీ ఆదర్శం కావాలన్నారు. ఇదే పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కుశ్వంత్ చదువుకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుశ్వంత్ మాట్లాడుతూ పుదుచ్చేరిలోని జిప్మర్ మెడికల్ కాలేజీలో ఉచిత మెడికల్ సీటు వచ్చిందని, చదువుకు తప్ప పుస్తకాలు ప్రయాణ ఖర్చులకు, ఇతర ఖర్చులకు సొంతంగా డబ్బులు అవసరం ఉంటాయని కలెక్టర్‌కు వివరించారు. కుశ్వంత్‌కు సాయం అందించేందుకు అధికారులు, ప్రభుత్వం, ఎన్‌ఆర్‌ఐలు ముందుకు రావడం పట్ల అతడి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసి, ‘ఆంధ్రభూమి’కి కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం...కుశ్వంత్‌ను అభినందిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్లు