రాష్ట్రీయం

కొలువుదీరిన కొత్త అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 12: ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ సమావేశాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నిర్దేశించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 11.05 గంటలకు జాతీయ గీతాలాపనతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు స్పీకర్ స్థానంలో ఆశీనులయ్యారు. తొలుత కడప జిల్లా పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రమాణ స్వీకారం చేసి స్పీకర్‌తో పాటు అధికార, ప్రతిపక్ష సభ్యులకు అభివాదం చేసి తొలి సంతకం చేశారు. అనంతరం చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎన్నికైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు అంజాద్‌బాషా, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), పాముల పుష్ప శ్రీవాణి, కే. నారాయణ స్వామి, పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, తానేటి వనిత, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, ఆదిమూలం సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య, మోపిదేవి వెంకటరమణారావు, ధర్మాన కృష్ణదాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్, ముత్తింశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్), కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, సీహెచ్ శ్రీరంగనాథరాజు, గుమ్మనూరు జయరాం, ఎం శంకర్ నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర వరుస క్రమంలో ఎమ్మెల్యేలచే ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం 23 మంది శాసనసభకు హాజరు కాగా వైసీపీ ఎమ్మెల్యేలు 149 మంది, జనసేన తరుపున గెలుపొందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సహా మొత్తం 173 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి 11 గంటలకు శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. ముందుగా వేదపండితులు ఆశీర్వచనాలు చేశారు. ప్రధాన మార్గం గుండా సీఎం జగన్ శాసనసభలో ప్రవేశించగా వైసీపీ ఎమ్మెల్యేలు సాధారణ మార్గంలో అనుసరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువాలతో, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పచ్చచొక్కాలతో శాసనసభకు హాజరయ్యారు. ప్రతిపక్షనేత చంద్రబాబుతో పాటు మాజీమంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, గొట్టిపాటి రవికుమార్, వల్లభనేని వంశీ, గద్దే రామ్మోహన్‌రావు, ఇతర ఎమ్మెల్యేలు ఉదయం 10.15 గంటలకు ఉండవల్లి నుంచి బయల్దేరి వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం శాసనసభ ఆవరణకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ‘ ఆరాధ్య దైవం జగన్‌పై ప్రమాణం’ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చివరలో వాటిని రికార్డుల నుంచి తొలగించి మరోసారి ప్రమాణ స్వీకారం చేయించారు. నెల్లూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్‌ఖాన్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషా శ్రీచరణ్ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు మరొకరు అనివార్య కారణాల వల్ల సమావేశాలకు హాజరుకాలేదు. మిగిలిన 173 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం ముగియటంతో మధ్యాహ్నం 3.30 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ చిన అప్పలనాయుడు ప్రకటించారు. శాసనసభకు ఎన్నికైన అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకరినొకరు పలుకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఉద్యోగ నేతలతో చర్చించాల్సి ఉన్నందున మధ్యాహ్నం 12.20 గంటలకు సీఎం జగన్ సభ నుంచి నిష్క్రమించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభలోనే గడిపారు. శాసనసభ ప్రవేశ ద్వారాలను అట్టహాసంగా పూలతో అలంకరించారు. పూర్తి స్థాయిలో సభ్యులు హాజరు కావటంతో కోలాహలం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అనుచరులతో లాబీ క్రిక్కిరిసింది.

చిత్రాలు.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు