రాష్ట్రీయం

రేపు ఢిల్లీకి జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. 17 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నందున 15న వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున నీతి ఆయోగ్ ఎదుట రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై వాదనలు వినిపించాలని నిర్ణయించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉభయ సభల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సూచనలిస్తారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, కేంద్ర నిధులకు డిమాండ్ చేయాలని వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన నవరత్నాలతో పాటు మరికొన్ని హామీలు నెరవేర్చాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి. గతంలో ప్రత్యేక హోదా డిమాండ్‌తోనే కేంద్రంపై అవిశ్వాసంతోపాటు పార్టీ ఎంపీలచే రాజీనామా చేయించారు. ప్రస్తుతం కేంద్ర నిధులపై సానుకూల స్పందన వ్యక్తమవుతుందనే భావన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వైసీపీ లోక్‌సభలో మూడవ పెద్ద పార్టీగా ఉంది. పార్టీ తరుపున 23 మంది ఎంపీలు ఎన్నిక కావటంతో అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చయినా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో జగన్ ఉన్నారు. ఇందులో భాగంగానే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.