రాష్ట్రీయం

కాంగ్రెస్ జీవకణాల్లోనే అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 20: అసహనం అన్నది కాంగ్రెస్ జీవకణాల్లోనే ఉందని, సహనం అంటే కమ్యూనిస్టులకు తెలీదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు విమర్శించారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల తీర్పును కాంగ్రెస్ సహించలేక అసహనంతో కుంగిపోతోందని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దాదాపు50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ తన నష్టాన్ని దేశ నష్టంగా చూపి అసహన చర్యలకు పాల్పడిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందన్నారు. రాష్ట్రాల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను రద్దు చేయడం, ఎమర్జెన్సీ విధించి వ్యతిరేకులను జైళ్లలో పెట్టడం వంటి చర్యలకు కాంగ్రెస్ పాల్పడిందన్నారు. మూడు దశాబ్దాల తర్వాత దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీకి పూర్తి మెజార్టీతో పట్టం కట్టారని, దీన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. సహనం కోల్పోయిన కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులకు కూడా కాంగ్రెస్ మతం రంగు పులుముతోందని ఆరోపించారు. దేశంలో అరాచకం సృష్టిస్తున్న పాకిస్తాన్ శక్తిని కొనియాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మన్ ఖుర్షీద్, షకీల్ అహ్మద్‌లు వాఖ్యానించడాన్ని వెంకయ్య తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతల్లో పేరుకుపోయిన అసహనానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా అని ప్రశ్నించారు. మతం, కులం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విషయంలో కాంగ్రెస్ తీరును ఆయన ప్రస్తావించారు. పంజాబ్‌లో బింద్రన్‌వాలేను రెచ్చగొట్టి తీవ్రవాదాన్ని పెంచిపోషించింది, అసోంలో ఉల్ఫా తీవ్రవాదులకు దన్నుగా నిలిచింది, శ్రీలంకలో ఎల్‌టిటిఇని ప్రోత్సహించింది కాంగ్రెస్సేనన్నారు. భారత్, పాక్‌ల మధ్య సఖ్యత కుదరాలంటే ప్రధాని నరేంద్ర మోదీ అడ్డని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు వారు పొగుడుతున్న పాక్ నేతలతో చర్చించి దేశంలో ఉగ్ర దాడులను నిరోధించాలని సవాల్ విసిరారు. ఏభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధ్యం కాని భారత్, పాక్ సఖ్యత ఏడాదిన్నర మోదీ పాలనలో కోరుకోవడం హాస్యాస్పదమన్నారు.

విశాఖలో విలేఖరులతో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు