రాష్ట్రీయం

అభివృద్ధి మండళ్ల పునరుద్ధరణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనా సంస్కరణలలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విధానాలను అనుసరిస్తున్నారు. గతంలో అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు కట్టబెట్టేందుకు, అధికార వికేంద్రీకరణకు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేశారు. సీనియర్ నేతలు గాదె వెంకట రెడ్డి లాంటి వారికి అప్పట్లో అవకాశమిచ్చారు. అయితే అప్పట్లో అవి అర్ధంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ 150 మంది ఎమ్మెల్యేలకు పదవుల పందారంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు మరో రెండింటితో కలిపి ఐదు మండళ్లు ఏర్పాటు చేయటం ద్వారా ఐదుగురిని చైర్మన్‌లుగా నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి విదితమే. ఒక్కో జిల్లాకు రూ 50 కోట్ల నిధులు ఏటా మంజూరు చేస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ నుంచి వైదొలగటంతో మూడో ఏడాది నుంచి నిధులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కేంద్రం నుంచి వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీతో పాటు కోస్తాలో పల్నాడును కలుపుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ మండళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.