రాష్ట్రీయం

సభా గౌరవాన్ని కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: గతంలో శాసన సభలో పెద్దలు నెలకొల్పిన సంప్రదాయాలను కాపాడుకుందామని, దేశంలోనే ట్రెండ్ సెట్టర్‌గా సభను నిలుపుదామని ఎమ్మెల్యేలకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా గురువారం ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత సభ్యుల అభినందనలపై ఆయన స్పందిస్తూ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా బాధ్యతలను నిర్వహించానని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకోడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని, సభా గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. దీనికి అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. గురువారం సమావేశం జరిగిన తీరు కొంత బాధాకరంగా ఉందన్నారు. శాసన వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శాసన వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకం పోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. శాసన సభ నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించాల్సిన పరిస్థితి ఏనాడూ రాకూదని కోరుకుంటున్నానన్నారు. ఫిరాయింపుల చట్టం ఉన్నా అమలు చేయలేని శాసన వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలకు పరిష్కారాలు ఇవ్వడం కన్నా ఇంకేం కావాలన్నారు. ఈ ఐదు సంవత్సరాల్లో ఫిరాయింపుల సమస్య వస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. శాసన వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అనుమానాలు పోగొట్టి చైతన్యం తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రతిపక్షం తప్పు చేస్తే, ప్రజలే ప్రతిపక్షంగా ఉంటారన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రోజుకు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతోందన్నారు. సభ్యులంతా మంచి శాసన వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయాలని, దేశంలోనే ట్రెండ్ సెట్టర్‌గా ఈ సభ నిలవాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇతరులకు ఆదర్శంగా సభ్యులు ఉండాలన్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తుంటారని, అంతిమంగా వారు చేయాలనుకున్నదే చేస్తారన్నారు. నిరక్షరాస్యత, వలసల నివారణ, తదితర అంశాలపై చర్చిద్దామని, ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వం ఆలోచించాల్సి ఉందన్నారు. సభలో అర్థవంతమైన చర్చలు జరిగేలా సహకరించాలని కోరారు. సభలో దాదాపు 100 మంది తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారని, వీరందరికీ త్వరలో నిపుణులతో వివిధ అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.

చిత్రం...తమ్మినేనిని స్పీకర్ స్థానం వద్దకు తోడ్కొని వెళుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి