రాష్ట్రీయం

చట్టసభలపై నమ్మకం పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: చట్టసభలపై ప్రజల్లో నమ్మకం పెంచుతామని, విలువల్లేని రాజకీయాలను గతంలో ఇదే సభలో చూశానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అసెంబ్లీకి కొత్త స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారామ్‌ను అభినందిస్తూ ఆయన గురువారం సభలో ప్రసంగించారు. స్పీకర్ ఎంపిక చేసినప్పుడు తనకు ఎన్నో ఆలోచనలు వచ్చాయన్నారు. గతంలో సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. చట్టాలకు తూట్లు పొడిచారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయలేదని, ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వని దిగజారిన వ్యవస్థను ఇదే చట్టసభలో చూశానన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుని, పార్టీ కండువాలు కప్పి, మంత్రి పదవులు ఇచ్చారన్నారు. స్పీకర్‌పై అవిశ్వాసానికి ఉన్న నిబంధనను అప్పటికప్పుడు మార్చడం చూశానని తెలిపారు. సభా సంప్రదాయాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇన్ని చూశాక స్పీకర్‌ను ఎన్నిక చేసేటప్పుడు ఎలా ఉండాలని, నెగ్గుకురాగలనా అన్న మీమాంస తనకు కలిగిందన్నారు. కానీ తాను కూడా అటువంటి అన్యాయమైన సంప్రదాయాన్ని పాటిస్తే, మంచి ఎక్కడా బతకదన్నారు. రాష్ట్రం బాగుపడే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించారు. అందుకే సభా సంప్రదాయాలు, పార్లమెంటరీ విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి తెలిసిన వ్యక్తిగా, అటువంటి గుణాలు ఉన్నాయని తమ్మినేనిని ఎంపిక చేశానని వెల్లడించారు. చట్ట సభల మీద నమ్మకం పెంచేందుకు, వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు ఒక మంచి మనసుతో స్పీకర్ పదవికి ఆయన్ని ఎంపిక చేశానని వివరించారు. ఆయన మంచి సంప్రదాయాలు పాటిస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు.
గత శాసన సభలో టీడీపీ చేసిన అన్యాయాలకు దేవుడు, ప్రజలు సరైన తీర్పు ఇచ్చారన్నారు. అయినా కుక్క తోక వంకర అన్నట్లుగా టీడీపీ తీరు మారడం లేదన్నారు. ఇదే సభలో 67 మంది వైకాపా ఎమ్మెల్యేలు ఉండగా, 23 మందిని ప్రలోభ పెట్టారని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవలసిన వారు అధికార పక్షంలో కూర్చున్నారన్నారు. చట్టాలకు తూట్లు పొడిచారన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకుంటే దేవుడు సరిగా ఆ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలనే ఇచ్చారని, 23వ తారీఖునే తీర్పు ఇచ్చాడన్నారు. ఇంతకంటే సరైన తీర్పు ఉండదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామంలోని అందం, దేవుడి దయ ఎలా ఉంటుందో ఈ సభను చూస్తే తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రలోభ పెట్టి తీసుకుంటే ఏం జరిగిందన్నారు. ప్రజలు గూబగుయ్ మనేట్టు కొట్టారన్నారు. స్పీకర్ ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం నిరూపిస్తే, ఎలా ఉండాలో ఈ ప్రభుత్వం చూపించి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తాను కూడా చంద్రబాబు మాదిరిగా ప్రలోభాలు పెట్టి, మంత్రి పదవులు ఇస్తానని ఐదుగురిని ఆశపెట్టి ఉండే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కేది కాదన్నారు. తనతో ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారో చెప్పడం లేదని, అందుకు చంద్రబాబు సంతోషపడాలన్నారు. పార్టీ ఫిరాయింపులు కొనసాగనివ్వద్దని, చట్టసభలో ప్రతిపక్షం ఉండాలన్నారు. ఎక్కడైనా ఫిరాయింపు జరిగితే చర్యలు తీసుకునేందుకు స్పీకర్‌కు పూర్తి అధికారాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫిరాయింపులను ప్రొత్సహిస్తే చంద్రబాబుకు, తనకూ తేడా ఉండదన్నారు. తాము ఎవరినైనా పక్క పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటే, రాజీనామా చేశాకే తీసుకుంటామని స్పష్టం చేశారు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని, వెనె్నముకగా మారుస్తామన్నారు. అందుకే మంత్రి మండలిలో 60 శాతం వారికే అవకాశం ఇచ్చామన్నారు. ఉపముఖ్యమంత్రులుగా బీసీలనే నియమించామన్నారు.