రాష్ట్రీయం

పోరాటాలు కొత్త కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తనకు పోరాటాలు కొత్త కాదని, ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన గళం తగ్గదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ్మినేని సీతారాంను అభినందించే సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన తరువాత రెండో స్పీకర్‌గా తమ్మినేని ఎన్నిక కావడాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఎన్టీఆర్ పిలుపును అందుకుని విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అనేక శాఖలకు మంత్రిగా పని చేశారు. శ్రీకాకుళం జిల్లా నలుగురు స్పీకర్‌లను అందించిందన్నారు. ఒక దశలో మైక్ సరిగా పని చేయకపోవడంతో చంద్రబాబు మాటలు సరిగా వినిపించలేదు. దీంతో వైకాపా, టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేసుకున్నారు. మాట సరిగ్గా రావడం లేదంటూ వైకాపా సభ్యులు ఎద్దేవా చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, తమ హయంలో మైకులు బాగా పని చేశాయని, వైకాపా రాగానే పని చేయడం లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో పని చేయడం తమకు కొత్త కాదని.. ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం కొనసాగిస్తామన్నారు. తన వాయిస్ తగ్గలేదని, గట్టిగా మాట్లాడగలనని తెలిపారు. అధికార పక్షం సభా సంప్రదాయాలను పాటించలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా సభా గౌరవాన్ని పాటించలేదని, ఇష్టమైతే రండి లేకపోతే లేదన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు. ప్రజలు ఏమనుంకుంటున్నారో అన్న అంశాన్ని ఆలోచించాలన్నారు. ఈ విషయాన్ని సభద్వారా ప్రజానీకానికి చెబుతామన్నారు. కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, వాటిని వైకాపా పాటించలేదని.. అయినా తాము సహకరిస్తామన్నారు. ఈ సమయంలో వివాదాలకు పోదలచుకోలేదన్నారు.