రాష్ట్రీయం

అభివృద్ధి మండళ్ల రాష్ట్ర చైర్మన్‌గా ధర్మాన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొత్తగా ప్రాంతీయ మండళ్ళ ఏర్పాటుకు ఉత్తర్వులు విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ఉత్తర్వుల మేరకు ఉత్తర కోస్తా ప్రాంతీయ అభివృద్ధి మండలి కిందకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలిగా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు గోదావరి ప్రాంతీయ మండలి, కృష్ణా, గుంటూరు జిల్లాలు అమరావతి అభివృద్ధి మండలిగా, రాయలసీమ ప్రాంతీయ అభివృద్ధి మండలి కిందకు చిత్తూరు, అనంతరపురం, కడప, తదితర జిల్లాలను చేర్చనున్నారు. ఇలా ఐదు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళ ఏర్పాటుకు జగన్ సర్కార్ సన్నాహాలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఐదు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళకు రాష్ట్ర చైర్మన్‌గా మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావును నియమించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జగన్ కేబినేట్‌లో బెర్తు ఇవ్వలేదంటూ సీనియర్ నేత ధర్మాన అనుచరులు, అభిమానులు గుర్రుగా ఉన్న నేపథ్యంలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళకు చైర్మన్‌గా కేబినేట్ హోదాతో కలిగిన ఈ విధులను ధర్మానకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అప్పగించనున్నట్టు గురువారం అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం వెల్లడైన అంశం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వరుసగా విడుదల కానున్న ఉత్తర్వుల్లో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళ జీవో కూడా విడుదల కానున్నది. ఐదు ప్రాంతీయ మండళ్ళ చైర్మన్లు తమ జిల్లాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమర్పిస్తుంటారు. వాటన్నీటినీ ప్రాధాన్యతాపరంగా, ఆర్థిక సమతుల్యతతో ప్రాంతీయ అభివృద్ధిపై సమగ్రంగా ముఖ్యమంత్రితో చర్చలు జరిపి ఐదు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళ పరిధిలో ఐదేళ్ళలో ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి పనుల పర్యవేక్షణ, దక్షత, అనుభవం కలిగిన ధర్మాన ప్రసాదరావును సీఎం ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.