రాష్ట్రీయం

కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వేలైన్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/ఓబులవారిపల్లె/విజయవాడ, జూన్ 15: నెల్లూరు-కడప జిల్లాల మధ్య ముడిసరుకుల రవాణా, ప్రయాణసౌకర్యాలు, కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులకు ఉద్దేశించిన కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వేలైన్ డీజిల్ ట్రాక్సన్ విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆర్‌వీఎన్‌ఎల్ అధికారులు వెల్లడించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సచివాలయానికి విషయాన్ని అధికారులు తెలియజేశారు. అనంతరం స్వయంగా ఉప రాష్ట్రపతితో ఫోన్‌లో మాట్లాడిన ఆర్‌విఎన్‌ఎల్ అధికారులు, డీజిల్ ట్రాక్షన్ విజయవంతమైందని, జూన్ 20 నుంచి ఎలక్ట్రికల్ ట్రాక్సన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రైల్వేట్రాక్సన్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఉప రాష్టప్రతి, ప్యాసింజర్ (ప్రజారవాణ) సౌకర్యాలు కల్పించే పనుల గురించి ఆరా తీశారు. ప్రస్తుతం పని నడుస్తోందని అధికారులు తెలియజేయగా, ఈవిషయాన్ని ఇప్పటికే రైల్వేమంత్రితో మాట్లాడానని, అవసరమైతే మరోసారి సమీక్షిస్తానని, వీలైనంత త్వరగా ఈ రైల్వేలైన్‌కు రైల్వేబోర్డు నుంచి అనుమతులు పొంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
రైల్వేశాఖ మంత్రి, కృష్ణపట్నం పోర్టు కంపెనీ, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో నడిచిన ఈ ప్రాజెక్టును ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 2002లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపాదించారు. అప్పటి రైల్వేమంత్రి నితీష్‌కుమార్‌తో మాట్లాడి 2004లో ప్రాజెక్టును మంజూరు చేయించగా అనంతరం రైల్వేపనులు మొదలయ్యాయి. యుపీఏ హయాంలో ఆర్‌వీఎన్‌ఎల్, రైల్వేబోర్డు అధికారుల మధ్య తలెత్తిన నిధుల వివాదం వల్ల కొంత ఆలస్యం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి వెంకయ్య ఈ వివరాలు తీసుకెళ్లిన తర్వాత సమస్యలు పరిష్కారమయ్యాయి. 2014నుంచి పనులు వేగం పుంజుకున్నాయి. ఆ తర్వాత కూడా ఉప రాష్ట్రపతి అనేకమార్లు రైల్వేలైన్‌పై సమీక్షలు నిర్వహించారు. రూ.1950 కోట్లతో పూర్తయిన రైల్వేలైన్‌ను 2019 ఫిబ్రవరి 21న రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఉప రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించారు. అయితే టనె్నల్స్ విషయంలో చిన్నపాటి పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల వాటిని పూర్తిచేసి తాజాగా డిజిటల్ ట్రాక్సన్ నిర్వహించారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాలను కలుపుతూ కడప-నెల్లూరు మధ్య ముడిసరుకుల రవాణా కోసం ఉద్దేశించిన ఈ రైల్వేలైన్‌ను ప్రజారవాణా కోసం కూడా అందుబాటులో తెచ్చే విషయం గురించి ఇప్పటికే రైల్వేమంత్రితో ఉప రాష్టప్రతి మాట్లాడారు. తాజాగా మరోసారి రైల్వేమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఉప రాష్టప్రతిని కలిసిన పీయూష్ గోయల్‌తో ఈ విషయం గురించి చర్చించారు.
20న అధికారికంగా ప్రారంభం
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు ద్వారా ఎగుమతులు, దిగుమతులకు ఉద్దేశించిన కృష్ణపట్నం - ఓబులవారిపల్లి (కడప జిల్లా) రైల్వే లైన్‌పై శనివారం గూడ్స్ రైళ్ల రాకపోకలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త రైలు మార్గం నిర్మాణం కోసం 2002లోనే ప్రతిపాదన చేసిన ప్రస్తుత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దీనిపై హర్షాతిరేకం వ్యక్తం చేశారు. రైల్వే ఉన్నతాధికారులు ఢిల్లీలో నున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించే పనులు గురించి ఆరా తీశారు. ఈ విషయంపై తాను ఇప్పటికే రైల్వే మంత్రితో మాట్లాడానని, అవసరమైతే మరోసారి సమీక్షిస్తానని, వీలైనంత త్వరగా ఈ రైల్వే లైన్‌కు రైల్వేబోర్డు నుంచి అనుమతులు పొంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వెంకయ్య నాయుడు సూచించారు. కాగా ఈ నెల 20వ తేదీ అధికారికంగా విద్యుత్ లైన్‌పై గూడ్స్ రైళ్లు పరుగులు తీస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికి దాదాపు రూ. 1950 కోట్లు ఖర్చయింది. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ విజయవంతంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ, కృష్ణపట్నం పోర్టు కంపెనీ, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల భాగస్వామ్యంతో నడిచిన ఈ ప్రాజెక్టును వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి హోదాలో 2002లో వాజ్‌పేయి హయాంలో ప్రతిపాదించారు. నాటి రైల్వే మంత్రి నితీష్‌కుమార్‌తో మాట్లాడి 2004లో మంజూరు చేయించగా అనంతరం పనులు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు యుపీఏ హయాంలో రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ, రైల్వేబోర్డు అధికారుల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా కొంత ఆలస్యం జరిగింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వెంకయ్య నాయుడు తీసుకెళ్లటం ద్వారా సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. 2014 నుంచి పనులు వేగం పుంజుకున్నాయి. రూ. 1950 కోట్ల వ్యయంతో పూర్తయిన ఈ రైల్వే లైన్‌ను గత ఫిబ్రవరి 21న రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఉప రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించారు. అయితే టనె్నల్ విషయంలో కొద్దిపాటి పనులు పెండింగ్‌లో ఉండటంతో వాటిని పూర్తి చేసి శనివారం గూడ్సు రైళ్లను లాంఛనంగా నడిపారు.