రాష్ట్రీయం

రక్షణ రంగం అమ్ముల పొదిలో వరుణాస్త్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రక్షణ రంగ అమ్ముల పొదిలోకి త్వరలోనే హెవీ వెయిట్ టార్పెడో వరుణాస్త్ర వచ్చి చేరనుంది. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌టీఎల్) వరుణాస్త్ర కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌కు రూ.1187.82 కోట్లతో ఆర్డర్ ఇచ్చింది. వరుణాస్తన్రు మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే ఆధునిక వెర్షన్ రూపకల్పన పరిశోధనలో ఉందని, ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ నందగోపన్ తెలిపారు. ఎన్‌ఎస్‌టీఎల్ - ఇండస్ట్రీ యూజర్ మీట్ ఎన్‌ఎస్‌టీఎల్ ప్రాంగణంలో శనివారం జరిగింది. అనంతరం ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ హెవీ వెయిట్ టార్పెడో (వరుణాస్త్ర)ను మరింత ఆధునీకరించేందుకు ఇప్పటికే పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం వరుణాస్త్ర సాంకేతిక పరీక్షల్లో ఉందని, త్వరలోనే ఆధునిక వెర్షన్ పరిశోధనలు పూర్తవుతాయన్నారు. వరుణాస్త్ర తొలి వెర్షన్‌కు సంబంధించి టార్పెడోల తయారీలో బీడీఎల్ నిమగ్నమై ఉందన్నారు. తొలి వెర్షన్ 40 నాటికన్‌మైళ్ల వేగంతో దూసుకెళ్లే సామర్ధ్యం ఉండగా, తరువాత వెర్షన్‌లో మరింత మెరుగైన సామర్థ్యంతో తీర్చిదిద్దనున్నట్టు వెల్లడించారు. సముద్ర గర్భం నుంచి సబ్‌మెరైన్‌ల నుంచి ప్రయోగించే జలాస్తన్రు తీర్చిదిద్దుతున్నట్టు పేర్కొన్నారు. జలాంతర్గాముల నుంచి టార్పెడోల ప్రయోగం విషయంలో గతంలో వైర్ సిగ్నల్స్ వినియోగించే పరిస్థితిలో మార్పు తెచ్చి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు.