రాష్ట్రీయం

విద్యకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, మంజూరు చేసిన 119 మహాత్మా జ్యోతిబా ఫూలే బిసీ గురుకుల పాఠశాలలను ఈ నెల 17 న ప్రారంభిస్తున్నామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని తమ ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటనలో భాగంగానే 119 గురుకులాలను ప్రారంభిస్తున్నామన్నారు. బడుగువర్గాల పిల్లలకు కార్పోరేట్ తరహాలో నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తుండగా, ప్రభుత్వ గురుకులాల్లో విద్యను ఉచితంగా అందిస్తున్నామన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడంతో బాటు భోజనం, పుస్తకాలు, నివాసం, యూనిఫామ్స్, కాస్మోటిక్స్, బూట్లు తదితరాలన్నీ ఉచితంగా అందిస్తున్నామని, దాంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గురుకులాల్లో ఫలితాలు అత్యద్భుతంగా ఉండటం మూలంగా ప్రవేశాలకు కూడా తీవ్రమైన పోటీ ఉంటోదన్నారు.