రాష్ట్రీయం

పీడబ్ల్యూఎఫ్‌ఎస్ సేవలకు చక్కని స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 15: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ నూతనంగా ప్రవేశపెట్టిన యాత్రికుల సంక్షేమ, సౌకర్యాల సేవ (పిలిగ్రిమ్ వెల్ఫేర్ ఫెసిలిటేషన్ సర్వీస్‌పి డబ్ల్యు ఎఫ్ ఎస్)కు విశేష స్పందన లభిస్తోంది. ఈ ఏడాది మే 3వతేదీ నుండి పీ డబ్ల్యు ఎఫ్ ఎస్ సేవలు కంపార్ట్‌మెంట్లలో సేవలు అందిస్తున్నారు. ఎక్కువమంది ఈ సేవకు రావడం ద్వారా యాత్రికులకు మరింత నాణ్యమైన సేవలందించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న యాత్రికులకు చేర్చడమే ఈ సేవ ముఖ్య ఉద్దేశం. వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1,2లలోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండే సమయం, దర్శనానికి వదిలే సమయం అన్నప్రసాదాల వివరాలు ఎల్ ఈ డి స్క్రీన్లలో సరిగ్గా ప్రదర్శితమయ్యేలా చూడాలి. అదే విధంగా యాత్రికులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు సక్రమంగా అందేలా, పారిశుద్ద్యం మెరుగ్గా ఉండేలా పర్యవేక్షించాలి. అత్యవసర సమయాల్లో వైద్యసదుపాయాలు అందించేలా అప్రమత్తంగా ఉండాలి. భక్తులకు అసవరమైన ఇతర ముఖ్య సమాచారాన్ని అందించాలి. ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి మరుసటిరోజు ఉదయం 8గంబటల వరకు రెండు షిప్టుల్లో కలిపి ప్రస్తుతం 50మంది పీ డబ్ల్యు ఎఫ్ ఎస్ సేవకులు కంపార్ట్‌మెంట్లలో సేవలందిస్తున్నారు. పీ డబ్ల్యు ఎఫ్ ఎస్ సేవకు విచ్చేసే మహిళలు, పురుషులు 35 నుండి 65సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గెజిటెడ్ హోదా కలిగి ఉండాలి.
అదేవిధంగా ప్రైవేటు రంగ సంస్థల్లోని వారికి పర్యవేక్షణ(సూపర్‌వైజర్) స్థాయిలో నిర్వహణ సామర్థ్యం ఉండాలి. యాత్రికుల సంక్షేమ, సౌకర్యాల సేవ కోసం టీటీడీ వెబ్‌సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.తిరుమల. ఆర్గ్‌లో శ్రీవారి సేవ అనే లింక్‌ను క్లిక్ చేయాలి. ఇందులో పిలిగ్రిమ్ వెల్ఫేర్ ఫెసిలిటేషన్ సర్వీస్‌ను ఎంపిక చేసుకోవాలి. ఏడు లేదా 14 రోజుల స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవను పొందిన వారు తిరుమలలోని కళ్యాణ వేదిక వెనుకవైపు గల శ్రీవారి సేవ భవన సముదాయంలో రిపోర్ట్ చేయాలి.
చిత్రం... భక్తుల నుండి వివరాలు సేకరిస్తున్న పీడబ్ల్యూఎఫ్‌ఎస్ సేవకులు