రాష్ట్రీయం

డిసెంబర్ 31 నాటికి కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసే విధంగా కాంట్రాక్ట్ సంస్థకు గడువు విధించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఆదివారం ఉదయం దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉన్నతాధికారులతో కలిసి రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కనకదుర్గ ఫ్లైఓవర్ పనుల పురోగతిని మున్సిపల్ ఆఫీస్ నుంచి భవానీపురం వరకు పరిశీలించారు. అనంతరం ఫ్లైఓవర్‌పై విలేఖర్లతో మాట్లాడుతూ కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడ - హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రజలకు అత్యంత
ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫ్లైఓవర్‌ను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారన్నారు. ఆ నేపధ్యంలో డిసెంబర్ 31కి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశాలిచ్చామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటంతో ఫ్లైఓవర్ పనులు నత్తనడకన నడిచాయన్నారు. స్థానికంగా ఉన్న నాయకులు తొడలు కొట్టారు కాని ఆచరణలో పనులు చేయలేదన్నారు. రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ 85 శాతం ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయని, టెండర్లలో మూడున్నర సంవత్సరాలు అని ఇచ్చినా ఏడాది కాలంలో పూర్తి చేయాలని సోమా కన్‌స్ట్రక్షన్ కంపెనీకి తక్కువకు కోట్ చేయడంతో ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. వయాడక్ట్ కొత్త సాంకేతికతో కొత్త డిజైన్స్ వల్ల ఒక సంవత్సరం ఆలస్యమైందన్నారు. మూడు చోట్ల పిల్లర్స్ పనులు చేయాలంటే ఫ్లైఓవర్ వైపుగా వచ్చే ట్రాఫిక్‌ను ఆపాలన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రూ. 100 కోట్లు రావాల్సి ఉందని, పనులు చేయడానికి నిధులు సమస్యలేదన్నారు. ఫ్లైఓవర్ పనుల్లో జాప్యం వల్ల రూ. 25 కోట్లు అదనపు భారం పడిందన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎస్సీ జాన్‌మోషే, రోడ్లు, భవనాల శాఖ ఈఎస్‌సీ రాజీవ్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ రీజనల్ రవాణా అధికారి ఎస్‌కే సింగ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్ పనులను పరిశీలిస్తున్న మంత్రుల ధర్మాన కృష్ణదాస్, వెలంపల్లి శ్రీనివాస్