రాష్ట్రీయం

జోసా కౌన్సిలింగ్ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: దేశంలోని ఎన్‌ఐటీల్లో అడ్మిషన్లకు జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ -జోసా నోటిఫికేషన్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 16న మొదలై జూన్ 25న ముగుస్తుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు జూన్ 21న ప్రారంభం అవుతుంది. జూన్ 25వ తేదీలోగా అభ్యర్ధులు తాము కోరుకుంటున్న కాలేజీలను, బ్రాంచిలను నమోదు చేయాల్సి ఉంటుంది. జోసా కౌన్సిలింగ్ లో 31 ఎన్‌ఐటీలతో పాటు ఈ ఏడాది కొత్తగా మరో 107 విద్యాసంస్థలు చేరాయి. అందులో రెండు ట్రిపుల్ ఐటీలు, ఐదు జీఎఫ్‌టీఐలున్నాయి. తొలి దశ కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత మరో ఆరు విడతలు కౌన్సిలింగ్ను నిర్వహించనున్నారు. ఎన్‌ఐటీల్లో చిట్టచివరి సీటు భర్తీ అయ్యేంత వరకూ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఐఐటీల్లో అడ్మిషన్లకు అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తొలి రౌండ్ సీట్లను జూన్ 27న, రెండో రౌండ్ జూలై 3న, మూడో రౌండ్ జూలై 6న, నాలుగో రౌండ్ జూలై 9న, ఐదో రౌండ్ జూలై 12న, ఆరో రౌండ్ జూలై 15న, ఏడో రౌండ్ జూలై 18న ప్రకటిస్తారు. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు రాని వారు సైతం ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే వీలుంది. ఎప్పటికపుడు అభ్యర్ధులు తమ ప్రాధాన్యతలను నమోదు చేయడమేగాక, వాటిని లాక్ చేస్తుండాలి, అలా చేయకుంటే చివరి దశలో నమోదైన ప్రాధాన్యతలనే జోసా పరిగణనలోకి తీసుకుంటుంది. సీట్లు పొందిన వారు ఎస్‌బీఐ ఇ చలానా ద్వారా నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా సీటు అనుమతి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఒక సారి సీటు పొందిన వారు తర్వాత కావాలనుకుంటే తమ సీట్లను అదే సంస్థలో వేరే బ్రాంచిలోకి మార్చుకునేందుకు, వేరే కాలేజీలకు మారేందుకు కూడా వీలుకల్పిస్తుంది. ఒక వేళ మిగిలిన విడతల్లో ఐఐటీలో సీటు పొందినట్టయితే అభ్యర్ధులు ఆ విషయాన్ని ఐఐటీ రిపోర్టింగ్ సెంటర్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఐఐటీలో వచ్చిన సీటు వదులుకుని ఎన్‌ఐటీల్లోచేరాలనుకుంటే ఆ సమాచారాన్ని ఎన్‌ఐటీ రిపోర్టింగ్ సెంటర్ లో ఇవ్వాల్సి ఉంటుంది. చివరి దశ కౌన్సిలింగ్ వరకూ అభ్యర్ధులు తమకు సీటు నచ్చకుంటే ఏ దశలోనైనా సీటు రద్దు చేసుకుని చెల్లించిన ఫీజును వెనక్కు తీసుకోవచ్చు. ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో 1,61,319 మంది హాజరుకాగా, వారిలో 33,349 మంది అబ్బాయిలు, 5356 మంది అమ్మాయిలు అర్హత సాధించారు. కానీ సీట్లు దాదాపు 12000 వరకూ మాత్రమే ఉండటంతో మిగిలిన సుమారు 20వేల మంది మిగిలిన కోర్సుల్లోచేరాల్సిన అనివార్యత ఉంది.