రాష్ట్రీయం

సామరస్యంగా సాగుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 17: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన పంపకాలెలా జరగాలనే విషయమై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సమాలోచనలు జరిపారు. ఈ నెల 21న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరు కావాల్సిందిగా ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించేందుకు సోమవారం విజయవాడ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో బిజీబిజీగా గడిపారు. ఉదయం గన్నవరం విమానాశ్రయంలో కేసీఆర్‌కు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద కొద్దిసేపు ఆగి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. వాతావరణం కూడా చల్లబడటంతో కొద్దిసేపు ప్రకృతిని ఆస్వాదించారు. అనంతరం తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో ఆయనకు ఆతిథ్యమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ఆహ్వానపత్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు పలు కీలక అంశాలపై ఏకాంత చర్చలు జరిపారు. సుమారు రెండు గంటల సేపు చర్చలు కొనసాగాయి. విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థల బదలాయింపుపై దృష్టి సారించారు. షెడ్యూల్డ్ ఆస్తుల బదలాయింపుపై ఇరు రాష్ట్రాలకు ఉపయుక్తంగా కమిటీ వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన, బకాయిల సమస్యను ఏకాభిప్రాయంతో పరిష్కరించుకునేందుకు ఇరువురు సమ్మతించినట్లు చెప్తున్నారు. ఇంకా ఇరు రాష్ట్రాల మధ్య గతం నుంచి నెలకొన్న జల వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. కృష్ణా, గోదావరి జలాల వినియోగం విషయంలో కోర్టులు, ట్రిబ్యునళ్లను ఆశ్రయించకుండా సంప్రతింపుల ద్వారా రాష్ట్రాల దామాషా ప్రకారం పంపిణీ జరిగేలా చూడాలనే విషయమై సమాలోచనలు జరిపారు. ఈ నెల 24న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శులు హైదరాబాద్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో జల వివాదాలపై ముందుకెలా వెళ్లాలనే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఆర్టీసి ఆస్తుల పంపకాలపై కూడా చర్చించారు. కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు జగన్‌కు ఆహ్వానపత్రం అందజేశారు. అనంతరం గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వచనాలతో శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ దీక్ష స్వీకరణ కార్యక్రమానికి కేసీఆర్, జగన్‌లతో పాటు మాజీ ఎంపీ టి సుబ్బరామిరెడ్డి హాజరయ్యారు. స్వాత్మానందేంద్ర స్వామి సరస్వతిగా నామకరణం చేసిన కిరణ్‌కుమార్ శర్మకు ఇరు రాష్ట్రాల సీఎంలు కిరీట ధారణ చేశారు.

చిత్రం... కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అందజేస్తున్న
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్